
ట్రాక్టర్, ఆటో ఢీ.. ఐదుగురికి గాయాలు
భైంసారూరల్: భైంసా–బాసర జాతీయ రహదారిపై శుక్రవారం జరగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భైంసా నుంచి దేగాం వైపు ప్రయాణీకులతో ఆటో వెళ్తుంది. అదే మార్గంలో హరియాలీ కన్వెన్షన్ ముందున్న ట్రాక్టర్ యూటర్న్ చేస్తుండగా ఆటోఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇలేగాం గ్రామానికి చెందిన ఆకాశ్, సాయి, ఉమ్రి(కె) గ్రామానికి చెందిన చంద్రకాంత్, మహాగాం గ్రామానికి చెందిన గంగాధర్, శివలింగుకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108లో భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై శంకర్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదంపై విచారణ చేపట్టారు.

ట్రాక్టర్, ఆటో ఢీ.. ఐదుగురికి గాయాలు