శాసీ్త్రయ విజ్ఞానం పెంపొందించుకోవాలి
మెదక్ కలెక్టరేట్: విద్యార్థులు శాసీ్త్రయ విజ్ఞానం పెంచుకొని సుస్థిర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని డీఈఓ రాధాకిషన్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో తెలంగాణ బయోసైన్స్ ఫోరం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ హాజరై మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించడానికి టాలెంట్ టెస్టులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. తెలుగు మీడియంలో ప్రథమ స్థానంలో సీహెచ్ హారిక, జెడ్పీహెచ్‌ఎస్ ఇస్లాంపూర్, ద్వితీయ స్థానంలో భానుప్రియ, జెడ్పీహెచ్‌ఎస్ ఇస్లాంపూర్ నిలిచారు. అలాగే ఇంగ్లీష్ మీడియంలో ప్రథమస్థానంలో నందిని, టీఎస్‌ఎంఎస్ రేగోడ్, ద్వితీయస్థానంలో తస్నీమ్, జీజీహెచ్‌ఎస్ మెదక్ విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కార్యక్రమంలో బయోసైన్స్ ఫో రం జిల్లా అధ్యక్షుడు దొంతి ప్రసన్నకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్, ఏఎంఓ సుదర్శనమూర్తి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ రాధాకిషన్
Comments
Please login to add a commentAdd a comment