ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యం
ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి
మెదక్ మున్సిపాలిటీ: ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా జిల్లా పోలీస్‌శాఖ పనిచేస్తుందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో క్యూఆర్‌టీ పార్టీలతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. సామాన్యులకు భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ ఉంటుందని, శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉంటామన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో నేర నియంత్రణ అదుపునకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని పేర్కొన్నారు. ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తే వెంటనే డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూం 8712657888 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment