
ఆదివారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
పల్లె పోరు..
కసరత్తు జోరు
మెదక్‌జోన్: స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సమాయత్తం అవుతోంది. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అధికారులు ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే ఓటరు సవరణ, వార్డులు, పోలింగ్ బూత్‌లను సిద్ధం చేయగా.. 10 మంది టీఓటీలకు శిక్షణ సైతం ఇచ్చారు. 12 నుంచి ఆర్‌ఓలు, పోలింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలో 493 పంచాయతీలు ఉండగా.. ఈ గ్రామాల్లో ఎన్నికల నిర్వహణ కోసం ఉన్నతాధికారులు సిబ్బంది నియామకం చేపడుతున్నారు. ఇప్పటికే ఈనెల 5వ తేదీన రాష్ట్రస్థాయిలో నిర్వహించిన శిక్షణలో జిల్లాకు చెందిన 10 మంది టీఓటీలు పాల్గొన్నారు. వీరు ఈనెల 12వ తేదీన ఆర్‌ఓ, పీఓ, ఓపీఓలకు శిక్షణ ఇవ్వనున్నారు. 12, 13వ తేదీల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు, 14, 15న రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో ఆర్‌ఓలకు, ఏఆర్‌ఓలకు శిక్షణ ఇస్తారు. వీరు సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లను స్వీకరించనున్నారు.
ఆర్డీఓలకు శిక్షణ బాధ్యతలు
ఈనెల 12, 13 తేదీల్లో ఎన్నికల సిబ్బందికి ఇచ్చే శిక్షణ బాధ్యతలను ఆర్డీఓలకు అప్పగించారు. జిల్లాలో మెదక్, తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట నాలుగు రెవెన్యూ డివిజన్లు ఉండగా, రామాయంపేట కొత్తగా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు అయింది. అక్కడ ఆర్డీఓ లేరు. మెదక్ ఆర్డీఓనే రామాయంపేటకు ఇన్‌చార్జిగా కొనసాగుతుండటంతో ప్రస్తుతం ముగ్గురు ఆర్డీఓలు మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలకు చెందిన పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.
న్యూస్‌రీల్
జిల్లా యంత్రాంగం సమాయత్తం
ఇప్పటికే టీఓటీలకు శిక్షణ పూర్తి
12 నుంచి పోలింగ్ సిబ్బందికి..
జిల్లాలో 493 పంచాయతీలు,
4,228 వార్డులు
రెండు, మూడు విడతల్లో పోలింగ్
జిల్లాలో 21 మండలాలు ఉండగా.. వీటి పరిధిలో 493 పంచాయితీలు, 4,228 వార్డులు ఉన్నాయి. ఓటర్లు 5,25,478 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 2,72,672 కాగా పురుషులు 2,52,797 ఉన్నారు. ఇతరులు మరో 9 మంది ఉన్నారు. కాగా ఇప్పటికే జిల్లాకు బ్యాలెట్ పేపర్లు సైతం వచ్చాయి. జిల్లాలో రెండు, లేదా మూడు విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

ఆదివారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment