ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష

Published Sun, Feb 9 2025 7:53 AM | Last Updated on Sun, Feb 9 2025 7:53 AM

ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష

ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష

ఉమ్మడి జిల్లా నుంచి 1,677 మంది హాజరు

వర్గల్‌(గజ్వేల్‌): ఉమ్మడి మెదక్‌ జిల్లా వర్గల్‌ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల్లో ప్రవేశాలకు శనివారం వివిధ కేంద్రాలలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. గజ్వేల్‌, ప్రజ్ఞాపూర్‌, వర్గల్‌లోని 10 పరీక్ష కేంద్రాలలో ఈ పరీక్ష జరిగింది. ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం 2,610 మందికి గాను 1,677మంది విద్యార్థులు హాజరయ్యారు. 11వ తరగతి ప్రవేశపరీక్షకు మొత్తం 1,621 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,114 (68.72%) మంది హాజరైనట్లు నవోదయ ప్రిన్సిపాల్‌ దాసి రాజేందర్‌ పేర్కొన్నారు. 9వ తరగతి ప్రవేశపరీక్షకు 989 మందికి గాను 563 (56.93%) విద్యార్థులు హాజరైనట్లు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement