
ఇచ్చిన మాట నిలబెట్టుకోండి
● మల్లన్నసాగర్ భూ నిర్వాసితులను దూరం పెట్టారు ● గతంలో దీక్షలు చేసింది రాజకీయం కోసమేనా? ● ముఖ్యమంత్రి రేవంత్‌కు ఎమ్మెల్యే హరీశ్‌రావు లేఖ
సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాటి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసి, అధికారంలోకి రాగానే మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల సమస్యలకు దూరంగా ఉండటం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల పక్షాన నిరాహార దీక్షలు చేసింది రాజకీయమేనా అని ధ్వజమెత్తారు. ఇదేనా మీ నిరాహార దీక్షకు ఫలితమని నిలదీశారు. కోర్టు కేసుల్లో తీర్పు వచ్చిన వారికి, అక్కడక్కడ ప్యాకేజీ మిస్సయిన వారికి పరిహారం అందించాలని కోరుతూ శనివారం సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ రాశారు. బీఆర్‌ఎస్ మల్లన్నసాగర్ నిర్వాసితు లకు మెరుగైన ప్యాకేజీని అందించిందన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ప్రతీ నిర్వాసితుడికి గజ్వేల్ పట్టణ సమీపంలోనే 250 గజాల ఇంటి స్థలం, ఇల్లు నిర్మాణానికి రూ. 5.04 లక్షలు, రూ. 7.5 లక్షల పరిహారం అందజేశామన్నారు. ఇందు కోసం రూ. 1,260 కోట్లను ఖర్చు చేసి నిర్వాసితులకు అత్యంత ప్రాధాన్యతను కల్పించామని తెలిపారు. 90 శాతం మందికి పరిహారం ఇచ్చామన్నారు. కోర్టు కేసులో తీర్పు వచ్చిన మిగితా 10 శాతం మందికి, అక్కడ క్కడ ప్యాకేజీ మిస్సయిన వారికి అందిచాల్సి ఉందన్నారు. వెంటనే వీరికి పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాడు మేము తక్కువ పరి హారం ఇచ్చామని ఆరోపణలు చేశారు.. ఇప్పుడు సీఎం హోదాలో ఎక్కువ పరిహారం ఇచ్చి నిర్వాసితుల దగ్గర మీ మాట నిలబెట్టుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment