ఎమ్మెల్సీ ఓటర్లు@ 77,962
● ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితా విడుదల ● 71 మండలాల్లో.. 174 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు
సంగారెడ్డి జోన్: ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించిన తుది ఓటరు జాబితాను అధికారులు విడుదల చేశారు. తుది జాబితాను బట్టి మొత్తంగా ఉమ్మడి మెదక్‌లో 77,962 మందికి ఎమ్మెల్సీ ఓటుహక్కు లభించింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 71 మండలాల్లో 174 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. పట్టభద్రులలో ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేటలో 32,589గా ఉండగా, ఉపాధ్యాయులలో సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 32,12గా ఉన్నారు. గతేడాది డిసెంబరు 30న ప్రకటించిన తుది జాబితాలో 71,622మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం విడుదల చేసిన జాబితాలో 77,962 మంది ఓటర్లు ఉన్నారు. అంటే 6,340 మంది ఓటర్లు పెరిగారు.
Comments
Please login to add a commentAdd a comment