
భరోసా సెంటర్ సందర్శన మెదక్ జిల్లా కేంద్రంలోని భరోసా స
మూన్నాళ్లకే పగుళ్లు
కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేపట్టడంతో ఏడాదికే భవన గోడల పెచ్చులూడుతున్నాయి.
వివరాలు 9లో u
బుధవారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
మెదక్‌జోన్: జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. పక్క రాష్ట్రాల్లో ఈ వ్యాధి సోకిందని విస్తృతంగా ప్రచారం జరగడంతో ఇక్కడి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో ఈ వ్యాధి విస్తరించకుండా పశుసంవర్ధక శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాధి ఇంకా నిర్ధారణ కాలేదని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో విస్తృతంగా కోళ్లఫారాలను తనిఖీలు చేస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. మెదక్ జిల్లాలో 2,500 బ్రాయిలర్ కోళ్లఫారాలు ఉండగా.. లేయర్స్ (గుడ్లు) పెట్టే లేయర్ ఫారాలు 300వరకు ఉన్నాయి. వీటిపై లక్షలాది మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. బర్డ్‌ఫ్లూ ప్రచారం నేపథ్యంలో.. కిలో బ్రాయిలర్ కిలో చికెన్ ధర రూ.180కు పడిపోయింది. ఏపీలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ వచ్చిందనే ప్రచారం జరగటంతో ఆ ప్రభావం తెలంగాణపై విపరీతంగా పడిందని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, బర్డ్‌ఫ్లూ ప్రచారంతో తమ వ్యాపారం సైతం బాగా తగ్గిందని పలువురు కోళ్లఫారాల నిర్వాహకులు వాపోతున్నారు. అధికారలు వెంటనే తగు చర్యలు తీసుకోకపోతే తాము భారీ నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో బర్డ్‌ఫ్లూ లేదు
జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాధి సోకినట్లు ఇంత వరకు నిర్ధారణ కాలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పక్షం రోజులుగా ఫారాలను తనిఖీలు చేసి కోళ్లను పరిశీలిస్తున్నాం. అయితే.. జిల్లాలో ఎలాంటి ఆనవాళ్లు లేవు. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.
వెంకటయ్య, వెటర్నరీ జిల్లా అధికారి
న్యూస్‌రీల్

భరోసా సెంటర్ సందర్శన మెదక్ జిల్లా కేంద్రంలోని భరోసా స
Comments
Please login to add a commentAdd a comment