
భక్తులకు ఇబ్బందులు కల్గించొద్దు
ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ రాజశేఖర్ రెడ్డి, పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్‌గౌడ్‌తో కలసి ఏడుపాయల్లోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఆలయం వద్ద భక్తులకు ఇబ్బంది కలుగకుండా అన్నీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సీసీ కెమెరాలు సరిగ్గా పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రసాదం కౌంటర్ వద్ద తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాజగోపురం వరకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని, పోతంషెట్పల్లి, నాగ్సాన్‌పల్లి వైపు ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. బస్సులు ఆపేందుకు సరైన ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేయాలన్నారు. ఘనపురం ఆనకట్టపై బారికేడ్లు ఏర్పాటు చేసి.. బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు.
లెప్రసీపై వంద రోజుల
అవగాహన కార్యక్రమం
జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరాం
రామాయంపేట(మెదక్): వైద్యులు, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరాం సూచించారు. మంగళవారం ఆయన మండలంలోని ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. లెప్రసీ వ్యాధికి సంబంధించి వంద రోజుల అవగాహన కార్యక్రమం కొనసాగుతోందని, అనుమానం ఉన్నవారికి టెస్టింగ్‌కు పంపుతున్నామని పేర్కొన్నారు. ప్రతి రోజూ ఆస్పత్రికి ఎంతమంది బీపీ, షుగర్ రోగులు వస్తున్నారని, వారు ఆసుపత్రి నుంచే మాత్రలు తీసుకెళుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో
బీజేపీదే విజయం
నర్సాపూర్: ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థుల విజయం ఖాయ మని ఆ పార్టీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మల్లేష్‌గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. రెండు ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా మని చెప్పారు. పార్టీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్యల విజయానికి కార్యకర్తలంతా సమష్టి కృషితో పని చేయాలని చెప్పారు. కాగా బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన మల్లేష్‌గౌడ్‌ను పలువురు నాయకులు మంగళవారం సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
అంగన్‌వాడీ కేంద్రంసందర్శన
నిజాంపేట(మెదక్): నిజాంపేట మండల పరిధిలోని రజాక్‌పల్లిలో అంగన్‌వాడీ కేంద్రాన్ని మంగళవారం మహిళా శిశువు సంక్షేమ శాఖ జిల్లా అధికారి హైమావతి సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. పిల్లల ఎత్తులు, బరువులు అడిగి తెలుసుకున్నారు. అలాగే గర్భిణిలు,, బాలింతలకు గర్భస్థ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాలింతలకు పోషకాహారం, పిల్లలకు పాలు పట్టే విధానం గురించి వివరించారు. నిర్మాణంలో ఉన్న అంగన్‌వాడీ భవనం గురించి డీఈతో ఆరా తీశారు. కార్యక్రమంలో రామాయంపేట ప్రాజెక్టు సీడీపీఓ స్వరూప, నిజాంపేట సెక్టర్ సూపర్‌వైజర్, ఐసీపీఎస్ సిబ్బంది మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

భక్తులకు ఇబ్బందులు కల్గించొద్దు

భక్తులకు ఇబ్బందులు కల్గించొద్దు
Comments
Please login to add a commentAdd a comment