
కుస్తీ మే సవాల్
తలపడుతున్న మల్లయోధులు
టేక్మాల్ మండలం వెల్పుగొండలో తుంబురేశ్వర స్వామి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకలో భాగంగా మంగళవారం ఉదయం రుద్రాభిషేకం, పుష్పార్చన, బిల్వార్చన, ఆకులపూజ, పాదుకాపూజ నిర్వహించారు. మధ్యాహ్నం భక్తజన సందోహం మధ్య కుస్తీపోటీలను నిర్వహించారు. కొబ్బరికాయ కుస్తీని మొదలుకొని.. కడియం కుస్తీ వరకు హోరాహోరీగా సాగాయి. చిన్నారుల కుస్తీ పోటీ అందరిని ఆకట్టుకుంది. డప్పుల దరువుకు అనుగుణంగా కుస్తీలు కొనసాగాయి. ఈ పోటీలకు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల మల్లయోధులు పాల్గొన్నారు. చివరి కుస్తీలో కామారెడ్డి జిల్లా అంతాపూర్‌కు చెందిన గంగాదర్ ఇద్దరిపై గెలుపొందారు. విజేతకు కడియాన్ని, గ్రామస్తులు ఐదు తులాల వెండి కడియంతో పాటు నగదును అందించారు. అనంతరం రాత్రి వేళల్లో పల్లకిసేవ, రథోత్సవం, భజన కార్యక్రమాలు నిర్వహించారు. టేక్మాల్(మెదక్):

కుస్తీ మే సవాల్
Comments
Please login to add a commentAdd a comment