మెదక్ మున్సిపాలిటీ: మెదక్ మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సంజీవ్ మరణం కొత్త మలుపు తిరిగింది. మృతుడి సెల్‌ఫోన్‌లో దొరికిన వీడియోలతో కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. ఆ దిశగా విచారణ చేపట్టిన పోలీసులు.. ఈనెల 10వ తేదీన మున్సిపల్ శానిటేషన్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులను, ఒక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించినట్లు తెలిసింది. మెదక్ పట్టణంలోని పిట్లంబేస్ వీధికి చెందిన మల్లారెడ్డిపేట సంజీవ్(41) మెదక్ మున్సిపల్ శానిటేషన్ విభాగంలో ఔట్ సోర్సింగ్‌లో జవాన్‌గా పనిచేస్తున్నాడు. 2024 డిసెంబర్ 31న మెదక్ డంప్‌యార్డులో సంజీవ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో సంజీవ్ మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని కుటుంబీకులు, బంధువులు ఆరోపించారు. కాగా, ఇటీవల మృతుడు సంజీవ్ సెల్‌ఫోన్‌లో పలు వీడియోలు దొరకడంతో అతని కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించడంతో మున్సిపల్ అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఆ వీడియోలలో మున్సిపల్ శానిటేషన్ విభాగంలోని ఇద్దరు అధికారులు, ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పేరున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు సీఐ నాగరాజును వివరణ కోరగా.. సెల్‌ఫోన్ వీడియో ఆధారంగా ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై వివరణ కోరేందుకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డిని ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా స్పందించలేదు.
మున్సిపల్ అధికారులకు ముచ్చెమటలు
సంజీవ్ మృతి కేసులో కొత్త మలుపు
ముగ్గురిపై కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment