
వేసవిలో అంతరాయం లేని విద్యుత్
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ కలెక్టరేట్: వేసవిలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం రాత్రి విద్యుత్‌శాఖ రూరల్ జోన్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి, జిల్లా ఎస్‌ఈ శంకర్ కలెక్టర్‌ను కలిసి వేసవి విద్యుత్ ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలో కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్లు ఏర్పాటు, విద్యుత్ అంతరాయం లేకుండా రూపొందిస్తున్న సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై వివరించారు. అంతకుముందు జిల్లా విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో ఎస్‌ఈ, చీఫ్ ఇంజనీర్ జిల్లాలోని డీఈలు, ఏడీఈలు, ఏఈలతో సమావేశం నిర్వహించారు. మంగళవారం ఒకే రోజు 7.88 మిలియన్ యూనిట్లు (ఎంయూ) విద్యుత్ వినియోగం జరిగినప్పటికీ పూర్తిస్థాయిలో అందించామన్నారు. అదేవిధంగా జిల్లాలకు 90 ఎంయూ విద్యుత్‌ను సైతం సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మెదక్ పట్టణంతో పాటు మండలంలోని బాలానగర్‌లో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు చీఫ్ ఇంజనీర్ బాలస్వామి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment