
అభాగ్యులకు ‘వాత్సల్యం’
మెదక్ కలెక్టరేట్: అనాథ పిల్లల సంరక్షణకు ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. మిషన్ వాత్సల్య పథకంతో భరోసా కల్పిస్తున్నాయి. ఎంతో మంది అభాగ్యులు తల్లి, తండ్రిని కోల్పోయి ఆవేదన చెందుతున్నారు. అయినవారు లేక, బంధువులు ఆదుకోక అవస్థలు పడుతున్నారు. అలాంటి పిల్లలకు ఉన్నత చదువులు చెప్పిస్తున్నారు. వారు ప్రయోజకులుగా ఎదిగేందుకు నెలకు రూ. 4 వేలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. 2022లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టగా.. జిల్లాలో ప్రస్తుతం 102 మంది లబ్ధిపొందుతున్నారు. ప్రస్తుతం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
అర్హులు.. అర్హతలు
తల్లి లేదా తండ్రి, ఇద్దరిని కోల్పోయిన వారు, విడాకులు తీసుకున్న దంపతుల పిల్లలు, తల్లిదండ్రులు కోల్పోయి ఇతర కుటుంబాల్లో నివసిస్తున్న వారు, ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న వారి పిల్లలు, ఆర్థికంగా, శారీరకంగా బలహీనులై, తమ బిడ్డలను పెంచలేని, ప్రకృతి వైపరీత్యాల బాధితుల పిల్లలు, బాల కార్మికులు, బాల్యవివాహ బాధితులు, ఎయిడ్స్ బాధితుల పిల్లలు, అంగవైకల్యం, అక్రమ రవాణాకు గురైన వారు, ఇంటి నుంచి తప్పిపోయిన పిల్లలు, బాల యాచకులు, పీఎం కేర్ ఫర్ చిల్డ్రన్ పథకం మంజూరైన పిల్లలు, కోవిడ్– 19తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు పథకం పొందడానికి అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు రూ. 72 వేలు, పట్టణ ప్రాంతాల్లోని పిల్లల కుటుంబ వార్షికాదాయం రూ. 96 వేలకు మించి ఉండకూడదు. తప్పనిసరిగా ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఈ పథకానికి కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు అందజేస్తుంది. దరఖాస్తులను కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు సమయంలో విద్యార్థికి సంబంధించిన పలు ధృవీకరణ పత్రాలతో పాటు వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్, సంరక్షకులతో కూడిన జాయింట్ అకౌంట్ వివరాలు అందజే
నెలకు రూ. 4 వేలు అందజేత
ఎంపికై న విద్యార్థులకు నెలకు రూ. 4 వేల చొప్పున 18 ఏళ్ల వయసు వచ్చే వరకు భృతి అందజేస్తారు. పిల్లలు 30 రోజులకు మించి బడికి హాజరుకాకపోతే ఈ పథకం నిలిపివేస్తారు. అయితే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల విషయంలో మాత్రం మినహాయింపు ఉంటుంది. అలాగే ఈ పథకానికి ఎంపికై న పిల్లలు భవిష్యత్‌లో ఏదైనా హాస్టల్‌లో చేరితే అప్పటి నుంచి ఈ పథకం నిలిపివేస్తారు.
నిరంతర ప్రక్రియ
మిషన్ వాత్సల్య పథకం దరఖాస్తులు నిరంతర ప్రక్రియ. జిల్లాలో 152 మంది వరకు లబ్ధి పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం 102 మంది విద్యార్థులకు ఈ పథకం కింద భరోసా కల్పిస్తున్నాం. రెసిడెన్షియల్ హాస్టళ్లలో చేరినవారు, 18 ఏళ్లు నిండిన విద్యార్థులు ఈ పథకం నుంచి వెళ్లిపోతారు. ఆస్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తాం.
– కరుణశీల,
జిల్లా బాలల సంరక్షణ అధికారిణి
జిల్లాలో 102 మందికి భరోసా
కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ

అభాగ్యులకు ‘వాత్సల్యం’
Comments
Please login to add a commentAdd a comment