
ప్రజలకు భరోసా కల్పించండి
మెదక్ మున్సిపాలిటీ: ఎన్నో సమస్యలతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలకు మేమున్నామని భరోసా కల్పించాలని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సిబ్బందికి సూచించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నూతనంగా ఉద్యోగంలో చేరిన పోలీస్ సిబ్బందికి రెండు రోజులుగా శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోలీస్‌స్టేషన్‌కు వివిధ రకాల అభ్యర్థనలు, ఫిర్యాదులు, సమాచారం, సహాయం కోసం ప్రజలు వస్తుంటారని తెలిపారు. ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించాలన్నారు. ప్రతి పౌరుడికి సమన్యాయం జరిగేటట్లు చూడాలన్నారు. ప్రజలకు సత్వర న్యాయం జరగడానికి సాంకేతిక వనరులు వినియోగించుకోవాలని చెప్పారు. విధుల్లో మంచి ప్రతిభ కనబరిచి ప్రజల మన్ననలు పొందాలన్నారు. ఆదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్లు మధుసూదన్‌గౌడ్, అనిల్, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment