మెదక్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలోని విజయ డెయిరీలో జరిగిన రూ. 24 లక్షల స్కాంలో దళితుడిని బలిపశువు చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గత నెల 11వ తేదీన విజయ డెయిరీలో దుర్గాప్రసాద్‌తో పాటు అతడి తల్లిదండ్రులను చిత్రహింసలకు గురిచేశారని వాపోయారు. తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా మెదక్ టౌన్ పోలీసులు చిత్రహింసలు పెట్టి బల వంతంగా ఒప్పించారని తెలిపారు. పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజ్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్, పద్మారావు, గట్టయ్య, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment