
పేట పోలీస్‌స్టేషన్ తనిఖీ
పెద్దశంకరంపేట(మెదక్): పెద్దశంకరంపేట పోలీస్‌స్టేషన్‌ను మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కేసులకు సంబంధించి పలు రికార్డులను పరిశీలించారు. నేరాలకు సంబంధించిన కేసులను త్వరగా పరిష్కరించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. దొంగతనాలు జరగకుండా పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ శంకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన
శివ్వంపేట(నర్సాపూర్): ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలను శుక్రవారం ఆర్డీఓ మహిపాల్ పరిశీలించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించి శివ్వంపేట ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయనున్న రెండు పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, నీటి వసతితో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించాలని సిబ్బందికి సూచించారు. మండలవ్యాప్తంగా పట్టభద్రులు 571, ఉపాధ్యాయ ఓటర్లు 47 మంది ఉన్నారని చెప్పారు. ఆయనతో పాటు తహసీల్దార్ కమలాద్రి, ఉప తహసీల్దార్ షఫీయోద్దీన్ తదితరులు ఉన్నారు.
డంప్‌యార్డ్‌కు వ్యతిరేకంగా పోస్ట్‌కార్డు ఉద్యమం
నర్సాపూర్ రూరల్: ప్యారానగర్‌లో ఏర్పాటు చేస్తున్న డంప్‌యార్డుకు వ్యతిరేకంగా లోక్‌సత్తా ఉద్యమ సంస్థ జిల్లా కన్వీనర్ నాగేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం నర్సాపూర్ బస్టాండ్‌లో పోస్ట్‌కార్డు ఉద్యమం చేపట్టారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు మల్లేష్, నాగరాజు, నర్సమ్మ, రైతు రక్షణ సమితి సభ్యుడు చంద్రశేఖర్ పాల్గొని సంతకాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దట్టమైన అటవీ ప్రాంతంలో డంప్‌యార్డ్ ఏర్పాటు చేస్తే పర్యావరణ కాలుష్యంతో పాటు నర్సాపూర్ రాయరావు చెరువు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. జంతువులు, మనుషులు రోగాల బారిన పడే అవకాశం ఉంటుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ అధికారులకు విన్నవించేందుకు పోస్ట్‌కార్డు ఉద్యమం చేపడుతున్నట్లు తెలిపారు.
ఐటీఐఆర్‌కు జగ్గారెడ్డి
అర్థం చెప్పాలి
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఎద్దేవా
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : రాష్ట్రానికి ఐటీఐఆర్ మంజూరు చేయాలన్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డికి అసలు ఐటీఐఆర్ అంటే అర్థం చెప్పాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఎద్దేవా చేశారు. ప్రధాని మన్మోహన్‌సింగ్ హాయాంలో వచ్చిన ఐటీఐఆర్‌పై జగ్గారెడ్డికి కనీసం అవగాహన కూడా లేదన్నారు. కందిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సదాశివపేట మండలంలోని ఎమ్మారెఫ్ ఫ్యాక్టరీ యాజమాన్యం సుమారు 400 మంది కార్మికులను ఉన్నపళంగా ఉద్యోగాల్లోంచి తొలగించిందని, ఇదేమని ప్రశ్నిస్తున్న కార్మికులను పోలీసులతో దౌర్జన్యానికి పాల్పడుతోందన్నారు. జీతాలు పెంచాలని అడిగినందుకు వారి ఉద్యోగాలను తొలగించిందని, దీనిపై కార్మిక శాఖ అధికారులు కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనల్లో రూ. వేల కోట్లు పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తామని ప్రకటిస్తున్న రేవంత్ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్లో ఉద్యోగాలను తొలగిస్తే కనీ సం స్పందించకపోవడం శోచనీయమన్నారు.
రికార్డులు పరిశీలిస్తున్న
డీఎస్పీ ప్రసన్నకుమార్

పేట పోలీస్‌స్టేషన్ తనిఖీ

పేట పోలీస్‌స్టేషన్ తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment