
డ్రగ్స్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు
కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
మెదక్‌జోన్: యువత డ్రగ్స్, గంజాయిలాంటి మ త్తు పదార్థాల బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో మత్తు పదార్థాల నియంత్రణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. యువతకు మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. డ్రగ్స్ నిర్మూలనకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతి నెల సమావేశం నిర్వహించి యాంటీ డ్రగ్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పటిష్టంగా నిరంతర తనిఖీలు చేస్తుందన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 17 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 9 కేజీల మత్తు పదార్థాలను సీజ్ చేశామని వివరించారు. అదే విధంగా ప్రతి మూడవ బుధవారం జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment