కలెక్టర్ రాహుల్‌రాజ్
కౌడిపల్లి(నర్సాపూర్): సీహెచ్‌సీలో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం కౌడిపల్లి పీహెచ్‌సీ, సీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఓపీ, మందులు, ల్యాబ్, ఫార్మసీ, పరిసరాలను పరిశీలించారు. వైద్య సిబ్బంది రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి పలకరించి వైద్యసేవలపై ఆరా తీశారు. అలాగే సీహెచ్‌సీ నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో కంటే పీహెచ్‌సీ, సీహెచ్‌సీలో వైద్య సేవలు బాగున్నాయని కొనియాడారు. సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కాగా సీహెచ్‌సీలో నెలకు ఎన్ని ప్రసవాలు అవుతున్నాయని డాక్టర్‌ను ప్రశ్నించారు. రెండు, మూడు అవుతున్నాయని చెప్పడంతో ప్రసవాల సంఖ్య పెంచాలని ఆదేశించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. మందుల కొరతలేకుండా చూసుకోవాలని.. మార్చి చివరి నాటికి సీహెచ్ సీ భవనం పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఫోన్‌లో ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యులు శ్రీకాంత్, ఫెర్నజ్, మహిమా, హెడ్‌నర్స్ నాగమణి, సీహెచ్‌ఓ ఎలిజబెత్‌రాణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment