విద్యార్థులు మత్తుకు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు మత్తుకు దూరంగా ఉండాలి

Published Sun, Feb 16 2025 7:27 AM | Last Updated on Sun, Feb 16 2025 7:27 AM

విద్య

విద్యార్థులు మత్తుకు దూరంగా ఉండాలి

కౌడిపల్లి(నర్సాపూర్‌): విద్యార్థులు డ్రగ్స్‌, గంజాయి ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఉమ్మడి మెదక్‌ జిల్లా యాంటీ నార్కోటిక్‌ డ్రగ్స్‌ డీఎస్పీ పుష్పన్‌కుమార్‌ అన్నారు. శనివారం మండలంలోని తునికి వద్ద గల ఎంజేపీ బీసీ గురుకుల కళాశాలలో డ్రగ్స్‌, ఇతర మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్‌ హరిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. కొన్ని చోట్ల విద్యార్థులకు గంజాయి చాక్లెట్లు అలవాటు చేసి డబ్బు లు వసూలు చేస్తున్నారని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో యువత కొకై న్‌కు బానిస అవుతున్నారని చెప్పారు. ఎక్కడైన డ్రగ్స్‌, గంజాయి వాడుతున్నట్లు తెలిస్తే 1908కు ఫోన్‌చేసి చెప్పాలన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో యాంటీ నార్కోటిక్‌ డ్రగ్స్‌ సీఐ రాము, ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నేటి నుంచి మరోసారి

కులగణన సర్వే

మెదక్‌ కలెక్టరేట్‌ జిల్లాలో నేటి నుంచి ఈనెల 28వ వరకు మరోసారి సామాజిక ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహిస్తున్నా మని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ సూచించారు. శనివారం కలెక్టరేట్‌ నుంచి జిల్లాలోని ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లతో గూగుల్‌ మీట్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమగ్ర సర్వేలో పాల్గొనని వారి కోసం ఈ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డితో కలిసి రోడ్డు ప్రమాదాల నివారణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైవేపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రమాద సూచికలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

{ç³fË$ MóSïÜBÆŠḥ´ë˯]l¯]l$

కోరుకుంటున్నారు

నర్సాపూర్‌: రాష్ట్రంలో రామరాజ్యం స్థాపించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనను మళ్లీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. ఈనెల 17వ తేదీ కేసీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని బీఆర్‌ఎస్‌ అధిష్టానం రాష్ట్రంలో వారం రోజుల పాటు పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించిందని తెలిపారు. వృక్షోత్సవం కార్యక్రమంలో భాగంగా శనివారం పార్టీ నిర్ణయానికి అనుగుణంగా తన క్యాంపు కార్యాలయం వద్ద మొక్కలు నాటినట్లు వివరించారు. కేసీఆర్‌ హయాంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు శేఖర్‌, చంద్రాగౌడ్‌, మన్సూర్‌, సత్యంగౌడ్‌, భిక్షపతి, షేక్‌హుస్సేన్‌, నర్సింగ్‌రావు, బాల్‌రెడ్డి, వెంకటేష్‌, భిక్షపతిగౌడ్‌, ఎల్లం తదితరులు పాల్గొన్నారు.

డంప్‌యార్డ్‌ రద్దు చేయాలి

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: ప్రజాభిప్రాయానికి వ్యతిరేకమైన ప్యారానగర్‌ డంప్‌యార్డ్‌ను రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు డు చుక్కా రాములు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సంగారెడ్డిలోని కేవల్‌ కిషన్‌ భవన్‌లో శనివారం జరిగిన సీపీఎం నాయకుల జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పర్యావరణానికి నష్టం కలిగే విధంగా ప్యారానగర్‌ డంపింగ్‌ యార్డ్‌ నిర్మాణం చేపట్టడం సరైంది కాదన్నారు. జనావాసాలకు దూరంగా పర్యావరణానికి నష్టం లేనటువంటి ప్రాంతాలను ప్రభుత్వం ఎందుకు పరిశీలించడం లేదని ప్రశ్నించారు. అర్హులైన పేదలందరికీ ఆరు గ్యా రంటీలను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ప్రజలను సమీకరించి పోరాటాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
విద్యార్థులు మత్తుకు దూరంగా ఉండాలి 1
1/2

విద్యార్థులు మత్తుకు దూరంగా ఉండాలి

విద్యార్థులు మత్తుకు దూరంగా ఉండాలి 2
2/2

విద్యార్థులు మత్తుకు దూరంగా ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement