పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
గజ్వేల్: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. ఆదివారం గజ్వేల్ మండలం బెజుగామ గ్రామానికి చెందిన యువత కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. కులగణన సర్వే చరిత్రాత్మకమని చెప్పారు. ఎన్నోఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీల వర్గీకరణను సైతం కాంగ్రెస్ పూర్తి చేస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణయాలు విశేష ప్రజాదరణ పొందుతుండగా, ప్రతిపక్షాలకు మింగుడు పడటం లేదన్నారు. కాంగ్రెస్ నేతలు శివారెడ్డి, మల్లేశంగౌడ్‌ల అధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. కార్యక్రమంలో మార్కెట్ కమీటీ వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్, నాయకులు రామలుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment