‘మాత’కు అరకొర ఆహారం
మెనూ ఇలా..
ఉదయం అల్పాహారం
పులిహోరా, కిచిడి, ఉప్మా,
చట్నీ (300 గ్రాములు)
పాలు 100– 150 మిల్లీ గ్రా.. 3 బ్రెడ్స్
రెండు ఇడ్లీ సాంబారు, చట్నీ లేదా పొంగలి
మధ్యాహ్న భోజనం
అన్నం, 6 చపాతీలు ఒక్కోటి(30 గ్రా) అన్నం (450 గ్రా)
ఆకుకూర పప్పు (100 గ్రా), ఆకుకూర 50 (గ్రా) సాంబారు (150 గ్రా)
ఉడికించిన గుడ్డు, పెరుగు లేదామజ్జిగ (200 మిల్లీ గ్రా)
అరటి పండు లేదా కాలానుగుణంగాలభించే పండు 1
రాత్రి భోజనం
అన్నం 450 (గ్రా) లేదా6 చపాతీలు (30 గ్రాములు) ఒక్కోటి
ఆకుకూర పప్పు (50 గ్రా) ఒక కూరగాయ(100 గ్రా) సాంబారు (150 గ్రా)
ఉడికించిన గుడ్డు ఒకటి, పెరుగు లేదామజ్జిగ 200 (మిల్లీ గ్రా)
● ఎంసీహెచ్‌లో అమలు కాని మెనూ
● పట్టించుకోని ఉన్నతాధికారులు
● ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నకాంట్రాక్టర్
మెదక్‌జోన్: మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో అరకొర ఆహారం అందిస్తున్నారు. పట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం మెనూ రూపొందించగా.. ఇక్కడ మాత్రం అలాంటివి పాటించడం లేదు. చపాతీలు, పెరుగు ఇవ్వ డం లేదు. రోజుకు రెండు కోడి గుడ్లు పెట్టాల్సి ఉండగా.. ఒకే గుడ్డుతో సరిపెడుతున్నారు. వైద్యులకు ఒక రకం.. గర్భిణులు, బాలింతలకు మరోరకం భోజనం పెడుతున్నారు. ఇదంతా అధికారులకు తెలి సినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని పిల్లికొటాల్‌లో ఉన్న మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి జిల్లాతో పాటు కామారెడ్డి నుంచి ప్రసవం కోసం వందలాది మంది గర్భిణులు వస్తుంటారు. నిబంధనల ప్రకారం వీరికి, వైద్యులకు ఒకే రకమైన భోజనం తయారు చేయాలి. అయితే ఆదివారం వైద్యులకు ఒక రకం భోజనం తయారు చేసిన వంట నిర్వాహకులు, గర్భిణులు, బాలింతలకు మరో రకం తయారు చేశారు. వైద్యులకు అన్నంతో పాటు దొండకాయ కూర, ముల్లంగి ఫ్రై, పప్పు కూర వండగా.. బాలింతలు, గర్భిణులకు క్యాబేజీ పప్పు, నీళ్ల చారు తయారు చేశారు. రాత్రి భోజనంలో గుడ్డు, చపాతీ, పెరుగు లేదా మజ్జిగ ఇవ్వాలి. కానీ అవేవి ఇవ్వడం లేదు. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు.
‘మాత’కు అరకొర ఆహారం
‘మాత’కు అరకొర ఆహారం
Comments
Please login to add a commentAdd a comment