హెల్ప్‌డెస్క్ ద్వారా వినతుల స్వీకరణ
మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో హెల్ప్‌డెస్క్ ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నట్లు తెలిపారు. ప్రజలు తమ దరఖాస్తులను హెల్ప్‌డెస్క్‌లో అందజేయాలని సూచించారు.
మల్లన్న జాతరకు రండి
చేగుంట(తూప్రాన్): మండలంలోని ఇబ్రహీంపూర్ మల్లన్న జాతరకు రావాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు హైదరాబాద్‌లో ఆదివారం నాయకులు ఆహ్వానపత్రిక అందజేశారు. ఈనెల 23న భ్రమరాంబ సహిత మల్లికార్జునస్వామి సప్తమ వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నవీన్, ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు.
డంప్‌యార్డ్‌కు
వ్యతిరేకంగా పోరాటం
నర్సాపూర్: ప్యారానగర్‌లో నిర్మిస్తున్న డంప్‌యార్డుకు వ్యతిరేకంగా రోజుకో కార్యక్రమం చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది. ఆదివారం మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు సమావేశమై చర్చించారు. సోమవారం నుంచి డంప్‌యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ పార్టీలకతీతంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజలు, రైతులకు అవగాహన కల్పించి నిరసనలో పాల్గొనే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో ఆయా పార్టీల నాయకులు రాజేందర్, శ్రీధర్‌గుప్తా, భిక్షపతి, శ్రీశైలంయాదవ్, రమణారావు, బుచ్చెష్‌యాదవ్, శ్రీనివాస్‌గుప్తా, రాంచందర్, యాదగిరి, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
దేశానికి మోదీ పాలన అవసరం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్
రామాయంపేట(మెదక్): దేశానికి మోదీ పాలన అవసరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అ భ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా ఆదివారం రామాయంపేటలో ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ పాలన పట్ల ప్రపంచదేశాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయని కొనియాడారు. అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర కా ర్య వర్గ సభ్యుడు సిద్దరాంలు, పట్టణ అధ్యక్షుడు అవినాశ్‌రెడ్డి, మండలాధ్యక్షుడు నవీన్‌గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి దిలీప్, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన స్కౌట్స్, గైడ్స్ శిక్షణ
మెదక్ కలెక్టరేట్: మెదక్ అవుట్ డోర్ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించిన స్కౌట్స్, గైడ్స్ శిక్షణ శిబిరం ఆదివారం ముగిసినట్లు జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రధాన కార్యదర్శి ఇప్ప రాజేందర్ తెలిపారు. ఇందులో మొత్తం 36 మంది స్కౌట్ మాస్టర్స్, 19 మంది గైడ్ కెప్టెన్లు శిక్షణ పొందినట్లు చెప్పారు. అనంతరం వారు తమ పాఠశాలలో స్కౌట్ కార్యక్రమాలు పిల్లలకు నేర్పిస్తారని విరించారు. కార్యక్రమంలో శిక్షకులు మోహన్‌రావు, గట్టు వెంకట రమణమ్మ, రవికిరణ్ చారి, మహిపాల్, శివకుమార్, రాగేంద్ర, సంధ్య, కమల పాల్గొన్నారు.
హెల్ప్‌డెస్క్ ద్వారా వినతుల స్వీకరణ
హెల్ప్‌డెస్క్ ద్వారా వినతుల స్వీకరణ
హెల్ప్‌డెస్క్ ద్వారా వినతుల స్వీకరణ
Comments
Please login to add a commentAdd a comment