భోజనం రుచికరంగా ఉందా..?
మెదక్‌జోన్: జిల్లాలోని అన్ని సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాల్లో మెనూ పకడ్బందీగా అమలు చేయడం హర్షనీయమని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూరగాయలు, ఇతర సామగ్రిని పరిశీలించి విద్యార్థినులతో మాట్లాడారు. భోజనం రుచికరంగా ఉందా.. మెనూ ప్రకారం పెడుతున్నారా..? అని అడిగి తెలుసుకున్నారు. పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యా నైపుణ్యాలు మెరుగుపడుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. సమయానికి ఆహారం, నిద్ర అవసరమని అప్పుడే ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. కలెక్టర్ వెంట అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.
వివరాలివ్వని వారికి మళ్లీ కులగణన
హవేళిఘణాపూర్(మెదక్): సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు నమోదు చేయించుకోని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. ఆదివారం మెదక్ ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన కేంద్రాన్ని తనిఖీ చేసి మాట్లాడారు. సమగ్ర ఇంటింటి సర్వేలో వివరాలు నమోదు చేసుకొని వారు ప్రజాపాలన కేంద్రాల్లో సమాచారం అందజేయాలని సూచించారు. సందేహాలుంటే టోల్ ఫ్రీ నంబర్ 040– 21111111కు ఫోన్ చేయవచ్చన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ రఘు, సిబ్బంది సాయికుమార్, సంబంధిత పంచాయతీ సెక్రటరీలు తదితరులు ఉన్నారు.
విద్యార్థినులతో కలెక్టర్ రాహుల్‌రాజ్
Comments
Please login to add a commentAdd a comment