వచ్చేది మన ప్రభుత్వమే
బీఆర్‌ఎస్ నాయకులతో కేటీఆర్
రామాయంపేట(మెదక్): రానున్న రోజులు మనవే.. కలిసికట్టుగా పనిచేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెలుతూ రామాయంపేట శివారులోని ఓ హోటల్ వద్ద కొద్దిసేపు ఆగారు. ఆయనకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అధైర్యపడొద్దని, వచ్చేది మన ప్రభుత్వమేనని భరోసా ఇచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ఆధ్వర్యంలో కలిసి మెలిసి పనిచేయాలని సూచించారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్‌గౌడ్, సహకార సంఘం చైర్మన్ బాదె చంద్రం, ఇతర నాయకులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment