
భయం వీడి పరీక్షలకు సిద్ధం కావాలి
డీఈఓ రాధాకిషన్
కౌడిపల్లి(నర్సాపూర్): విద్యార్థులు భయం వీడి పరీక్షలకు సిద్ధం కావాలని డీఈఓ రాధాకిషన్ అన్నా రు. సోమవారం మండలంలోని వెల్మకన్న, కొట్టాల పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థు ల్లో నమ్మకం, మనోధైర్యం నింపేందుకు ప్రస్తుతం ప్రాక్టీస్, ఫ్రీ ఫైనల్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. జిల్లాలో ఈఏడాది 10,300 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారని వివరించారు. మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట ఎంఈఓ బాలరాజు, హెచ్‌ఎం సరోజ, ఉపాధ్యాయులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment