
పకడ్బందీగా డిజిటల్ సర్వే
నర్సాపూర్ రూరల్: డిజిటల్ పంట సర్వే పకడ్బందీగా చేపట్టాలని నర్సాపూర్ వ్యవసాయ శాఖ ఏడీ సంధ్యారాణి ఏఈఓలకు సూచించారు. సోమవారం నర్సాపూర్ డివిజన్ పరిధిలోని నర్సాపూర్, తూప్రాన్, మనోహరాబాద్ శివ్వంపేట మండలాల్లో కొనసాగుతున్న డిజిటల్ పంట సర్వే నమోదును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నర్సాపూర్ మండలంలో 6,947 ఎకరా ల్లో డిజిటల్ సర్వే పూర్తయిందని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసా య అధికారిణి దీపిక, ఏఈఓ చంద్రవేణి, రైతులు పాల్గొన్నారు.
నేడు విద్యుత్ సరఫరాలో
అంతరాయం
చిన్నశంకరంపేట(మెదక్)/శివ్వంపేట(నర్సాపూర్): మండలంలోని జంగరాయి సబ్‌స్టేషన్ పరిధిలో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏఈ దినకర్ తెలిపారు. వెల్దుర్తి 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మరమ్మతులు చేపట్టనున్నట్లు చెప్పారు. దీంతో జంగరాయి, చందాపూర్, ఎర్రగుంట తండాలో నేడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుందన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు. అలాగే పాంబండ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా పాంబండ, పోతులబొగూడ, ఉసిరికపల్లి, బీమ్లతండాలో నేడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ సాయికుమార్ తెలిపారు.
కేసీఆర్‌ను కలిసిన
ఎమ్మెల్యే సునీతారెడ్డి
నర్సాపూర్ రూరల్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సోమవారం సాయంత్రం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి తన కుమారులు శ్రీనివాస్‌రెడ్డి, శశిధర్‌రెడ్డితో కలిశారు. ఈసందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
అవగాహనతోనే క్షయ దూరం
చేగుంట(తూప్రాన్): క్షయ నివారణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ శ్రీరామ్ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన టీబీ నిర్ధారణ పరీక్ష కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా గ్రా మాల్లోని ప్రజలకు వంద రోజుల టీబీ కార్యక్రమంపై అవగాహన పెంపొందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. 170 మందికి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ నవీన్, చేగుంట, నార్సింగి మండలాల ఆరోగ్య కేంద్రాల సిబ్బంది, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
‘పార్టీలకతీతంగా పోరాడుదాం’
నర్సాపూర్ రూరల్: ప్యారానగర్‌లోని పచ్చని అడవిలో ఏర్పాటు చేస్తున్న డంపుయార్డ్‌ను ఎత్తేసే వరకు పార్టీలకతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నర్సాపూర్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలిపి మాట్లాడారు. డంపుయార్డ్ ఏర్పాటుతో ఐదు మండలాల ప్రజలకు ముప్పు ఉందన్నారు. నర్సాపూర్ రాయరావు చెరువు, ఆయకట్టు, హత్నూర, కొల్చారం మండలాల్లోని మంజీరా నది కలుషితం అయ్యే ప్రమాదం ఉందన్నారు. డంపుయార్డ్ ఎత్తేసే వరకు వివిధవర్గాలు పోరాటం చేయాలన్నారు. దీనికి పూర్తిస్థాయి మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. రిలే నిరాహార దీక్షకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్ సైతం మద్దతు పలికారు. కార్యక్రమంలో బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో పాటు ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.

పకడ్బందీగా డిజిటల్ సర్వే
Comments
Please login to add a commentAdd a comment