కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి
● ప్రజల అభిప్రాయం ఇదే.. ● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి
రామాయంపేట(మెదక్): కేసీఆర్ మళ్లీ సీఎం కా వాలని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా సోమవారం రామాయంపేటలో 72 కిలోల కేక్‌ను కట్ చేసి మాట్లాడారు. అధికార పార్టీ అభివృద్ధిని మరిచిందని, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో అన్నివర్గాల వారు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. పూటకో మాట మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు. రైతులు, ప్రజలు ధైర్యంగా ఉండాలని.. వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని భరోసా ఇచ్చారు. అభివృద్ధి కుంటుపడిందని, రాష్ట్ర ప్రభుత్వం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్‌గౌడ్, బీఆర్‌ఎస్ యూత్ విభాగం మండలాధ్యక్షుడు ఉమా మహేశ్వర్, సహకార సంఘం చైర్మన్ బాదె చంద్రం, నాయకులు కొండల్‌రెడ్డి, అహ్మద్, హస్నొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్‌ను కలిసిన పద్మారెడ్డి దంపతులు
మెదక్ మున్సిపాలిటీ: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా సోమవారం ఎరవ్రల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆయనను బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి దంపతులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్లు బట్టి జగపతి, కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment