వెల్దుర్తి(తూప్రాన్): బ్యాంక్ లింకేజీ కింద అర్హులైన స్వయం సహాయక సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని డీఆర్డీఓ శ్రీనివాసరావు ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం వెల్దుర్తి మండల సమైఖ్య కార్యాలయంలో నిర్వహించిన వీవోఏల రివ్యూ మీటింగ్‌కు ఆయన హాజరై పలు సలహాలు, సూచనలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బ్యాంకు లింకేజీ టార్గెట్ 130 శాతం చేయాలని, బ్యాంకు లింకేజీ ఎన్‌పీఏని 0.5 శాతానికి తగ్గించాలని సూచించారు. సీ్త్ర నిధి టార్గెట్ అచీవ్‌మెంట్ 130 శాతం చేయాలని, సీ్త్ర నిధి ఎన్‌పీఏని 0.5 శాతానికి తగ్గించాలన్నారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రతీ మహిళా ఒక్కొ మొక్క నాటాలని వివరించారు. కార్యక్రమంలో సీ్త్రనిధి ఆర్‌ఎం గంగారాం, ఏపీఎం శంకరయ్య, సీసీలు సత్యం, యాదగిరి, కిషన్, రజిత, సీ్త్రనిధి ఏఎం కరుణాకర్, వీవోఏలు పాల్గొన్నారు.
డీఆర్డీఓ శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment