జెడ్పీ సీఈఓ ఎల్లయ్య
కొల్చారం(నర్సాపూర్): పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అన్నారు. మంగళవారం మండలంలోని రంగంపేట ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ప్రధానోపాధ్యాయుడు ఉపేందర్ రెడ్డి, ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థులు పరీక్షలు అంటే భయం లేకుండా పూర్తి సన్నద్ధం చేయాలని సూచించారు. పాఠశాలలోని సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక్కడి పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న సిబ్బందిని అభినందించారు. ప్రత్యేక వంటశాల లేకపోవడంపై మధ్యాహ్న భోజన సిబ్బంది సీఈఓ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయమే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పీడీ శ్రీధర్ రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment