రేపటి నుంచి పారిశుద్ధ్య కార్మికుల సమ్మె
సీఐటీయూ ఉపాధ్యక్షురాలు
బాలమణి ప్రకటన
రామాయంపేట(మెదక్): తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పారిఽశుద్ధ్య కార్మికులు మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి మాట్లాడుతూ.. ఈనెల 20 నుంచి సమ్మె చేస్తామని, పారిశుద్ధ్య పనులు బంద్ చేస్తామని ప్రకటించారు. కార్మికుల సమస్యల పరిష్కారం విషయమై ఎవరూ పట్టించుకోవడంలేదని విమర్శించారు. జూలై నుంచి పీఎఫ్, ఈఎస్‌ఐ వారి ఖాతాల్లో జమ కావడం లేదని, వెట్టిచాకిరీ చేస్తున్న కార్మికులకు ఇస్తున్న నెలవారీ వేతనాలు సైతం సక్రమంగా రావడం లేదన్నారు. వారికి ఇవ్వాల్సిన సబ్బులు, మాస్కులు, గ్లౌవుజులు సైతం ఇవ్వడంలేదని వాపోయారు.
రేపటి నుంచి ఎలక్ట్రిక్
బగ్గీల పోటీలు
నర్సాపూర్ : బీవీ రాజు ఇంజనీరింగ్ కాలేజీలో 20 నుంచి 25 వరకు ఎలక్ట్రిక్ బగ్గీల పోటీలు ప్రారంభ మవుతాయని ప్రిన్సిపాల్ సంజయ్ దూబె తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జాతీయ స్థాయి ఈ బాహ –సే ఇండియా 2025ను తమ కాలేజీలో వరుసగా రెండోసారి నిర్వహించడం ఆనందించదగ్గ విషయమన్నారు. పోటీల ద్వారా విద్యార్థులు తమలోని నైపుణ్యాన్ని పెంచుకోవడంతోపాటు నిబద్ధత ప్రదర్శించే అవకాశం లభిస్తుందన్నారు. పోటీల్లో పలు రాష్ట్రాలకు చెందిన 85 ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన విద్యార్థుల జట్లు పాల్గొంటాయని పేర్కొన్నారు. ఈ పోటీలు వివిధ దశల్లో ఉంటాయని తెలిపారు. ఆయన వెంట కాలేజీ ప్రొఫెసర్లు రాయుడు, దశరథ రామయ్య, తదితరులు పాల్గొన్నారు.
ప్రశ్నించే గొంతుకను
ఎమ్మెల్సీగా గెలిపించండి
సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి
చిన్నశంకరంపేట(మెదక్): ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకనే ఎమ్మెల్సీగా గెలిపించాలని సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి కోరారు. మంగళవారం నార్సింగి మండల కేంద్రంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మల్లేశంగౌడ్‌తో కలిసి తన భర్త ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు, జెడ్పీ పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక గ్రాడ్యుయేట్స్‌ను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సామాజిక రంగంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడంతోపాటు ప్రజల కోసం పని చేసే వారిని గెలిపించాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే గుంపులో ఒకడిగా ఉంటాడు తప్పితే ప్రజల సమస్య పట్టవన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యపాల్‌రెడ్డి, గోవింద్, గణేశ్, పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్, బీజేపీ నాయకులు లింగారెడ్డి, నర్సింహులు, గురుపాథం, హరిబాబు, నరేశ్, సంతోష్‌రెడ్డి, చంద్రశేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.
శత శాతం ఉత్తీర్ణత సాధించాలి
డీఈఓ రాధాకిషన్
పాపన్నపేట(మెదక్): పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాథించాలని జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్ అన్నారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని కుర్తివాడ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులు ప్రాక్టీస్ టెస్ట్ ఎలా రాస్తున్నారో పరిశీలించారు. వచ్చే నెలలో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, మిగిలిన కొన్ని రోజులు ముఖ్యమైనవని చెప్పారు. సమయాన్ని వృథా చేయకుండా చదవాలని సూచించారు. ఉపాధ్యాయులు ప్రణాళిక ప్రకారం విద్యార్థులను సమాయత్తం చేయాలని కోరారు. ఆరవ తరగతి విద్యార్థులతో పాఠాలు చదివించారు. అనంతరం పాఠశాల రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఏఎంఓ సుదర్శన మూర్తి, హెచ్‌ఎం శ్రీనివాస్ రావు ఉన్నారు.
రేపటి నుంచి పారిశుద్ధ్య కార్మికుల సమ్మె
Comments
Please login to add a commentAdd a comment