
ఇది పట్టభద్రుల విజయం
నర్సాపూర్: తన విజయం పట్టభద్రులకు అంకితమని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. శనివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్ మున్సిపల్ మహిళా ఉద్యోగులకు చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పట్టభద్రుల సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పారు. చీరల పంపిణీ అభినందనీయమని కొనియాడారు. అనంతరం మురళీయాదవ్‌తో పాటు పలువురు నాయకులు ఎమ్మెల్సీ అంజిరెడ్డి, సంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరిని సన్మానించారు.
విద్యుత్ సమస్యలుతలెత్తకుండా చర్యలు
అల్లాదుర్గం(మెదక్): వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ చీఫ్ ఇంజినీర్ బాలస్వామి తెలిపారు. శనివారం మండలంలోని గడిపెద్దాపూర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో 5 మెగావాట్ల ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించి మాట్లాడారు. రైతులకు, వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడమే తమ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో మెదక్ విద్యుత్ శాఖ ఎస్‌ఈ శంకర్, డీఈ చాంద్‌పాషా, ఏడీ మోహన్‌బాబు, పాపన్నపేట ఏడీ శ్రీనివాస్, రేగోడ్ ఏఈ యాసిన్‌అలీ, అల్లాదుర్గం ఇన్‌చార్జి ఏఈ నవాజ్ పాల్గొన్నారు.
రూ. 35 లక్షలతో కొత్త విద్యుత్ లైన్
పాపన్నపేట(మెదక్): మండలంలోని విద్యుత్ సమస్యలు తీర్చేందుకు రూ. 35 లక్షలతో విద్యుత్ లైన్ వేస్తున్నట్లు చీఫ్ ఇంజినీర్ బాలస్వామి తెలిపారు. పొడ్‌చన్‌పల్లి ఫీడర్‌లో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా ఉపకేంద్రంలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఈ సమస్య తీర్చడానికి రూ. 35 లక్షలతో కౌడిపల్లి నుంచి 33 కేవీ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు చె ప్పారు. ఆదివారం పాపన్నపేట మండలంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని చెప్పారు.
ఎమ్మెల్యేకు సన్మానం
నర్సాపూర్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే సునీతారెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌రావు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం నర్సాపూర్‌లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో వారిద్దరు పాల్గొన్నారు.
కార్మికులకు
‘ఎంఆర్‌ఎఫ్’ షాక్
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ‘2021 మార్చి 29న ఏడాది పాటు శిక్షణ కోసం మిమ్మల్ని తీసుకున్నాం. ఆ కాలంలో మీరు పని నేర్చుకోలేదు. పరిశ్రమలో నెలకొన్న ఆర్థిక మాద్యం నేపథ్యంలో మిమ్మల్ని తొలగిస్తున్నాం. దేశంలోని ఇతర ప్లాంట్లలో అవసరమున్న చోట పని చేయడానికి ఆసక్తి ఉంటే వారం రోజుల్లో అభిప్రాయం తెలపండి’ అని మండలంలోని అంకేనపల్లి శివారులో గల ఎంఆర్‌ఎఫ్ (ఏపీఎల్) ప్లాంట్లో పనిచేస్తున్న 350 మందికిపైగా కార్మికులకు యాజమాన్యం ఈనెల 7న నోటీసులు అందజేసింది. దీంతో వారి భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దిక్కుతోచని స్థితిలో కార్మికులు మనోవేదనకు గురవుతున్నారు. రిక్రూట్‌మెంట్ సమయంలో చేసుకున్న ఒప్పందం మేరకు పర్మనెంట్ చేయాలని కోరిన పాపానికి ఉద్యోగంలో నుంచి తీసేసి పరిశ్రమ యాజమాన్యం నియంతృత్వం ప్రదర్శిస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా కార్మికులు న్యాయ పోరాటానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

ఇది పట్టభద్రుల విజయం
Comments
Please login to add a commentAdd a comment