
మహిళ లేనిదే సమాజం లేదు
మెదక్‌జోన్: మహిళ లేనిదే సమాజం లేదని, ప్రస్తు త పోటీ ప్రపంచలో వంటింటి నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారని జిల్లా జడ్జి లక్ష్మీశారద అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మెదక్‌లో కలం స్నేహం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అతివ’ పాటల సీడీని ఆవిష్కరించి మాట్లాడారు. మహిళలు చదువులో రాణిస్తూ ఆర్థికంగా ఎదగాలని, అప్పడే మహిళా సాధికారత సాధ్య మవుతుందన్నారు. ప్రభుత్వం అన్ని పథకాలలో మహిళలకు సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలం స్నేహం వ్యవస్థాపకుడు, సినీ సంగీత దర్శకులు శ్రీమాన్ గోపాల్ ఆచార్య, జాతీయ ప్రధాన కార్యదర్శి గీతాశ్రీ స్వర్గం,కన్వీనర్ రాధిక, సంయుక్త కార్యదర్శి సరళ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అన్నిరంగాల్లో రాణించాలి
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద అన్నారు. మహి ళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని ఫుట్‌బాల్ అకాడమీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయస్థాయిలో రాణించిన క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని వచ్చేసారి మరింతమంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు. అంతకుముందు క్రీడాకారులతో కలిసి సరదాగా ఫుట్‌బాల్ ఆడారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగరాజు జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి దామోదర్‌రెడ్డి, సీ్త్ర శిశు సంక్షేమశాఖ అధికారిణి సంతోష తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద
Comments
Please login to add a commentAdd a comment