
మెరుగైన వైద్యం అందించండి
కలెక్టర్ రాహుల్‌రాజ్
కొల్చారం(నర్సాపూర్): నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శనివారం మండలంలోని రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలు, వివరాలపై ఆరా తీశారు. ఆస్పత్రి సిబ్బంది హాజరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రం పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. రోగులకు అవసరమైన రక్త నమూనా పరీక్షలు సకాలంలో నిర్వహించి అవసరమైన మందులు అందించాలన్నారు. యాంటీబయోటిక్ మందులు, పాము కాటుకు సంబంధించిన వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఉచితంగా అందిస్తున్న వైద్య సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యాధికారి శివకుమార్, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment