ఆ నమ్మకం ఉంది – ఏయం రత్నం | 7G Brundavan Colony Re-Release Trailer | Sakshi
Sakshi News home page

ఆ నమ్మకం ఉంది – ఏయం రత్నం

Published Mon, Sep 18 2023 1:16 AM | Last Updated on Mon, Sep 18 2023 1:16 AM

7G Brundavan Colony Re-Release Trailer - Sakshi

సుమన్‌ శెట్టి, రవికృష్ణ, ఏయం రత్నం, సోనియా 

‘‘7/జీ బృందావన కాలనీ’ సినిమా ఎంత హిట్‌ అయిందో తెలిసిందే. ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్‌లో కూడా అంతే పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. రవి హీరోగా సెల్వరాఘవన్  దర్శకత్వంలోనే ‘7/జీ బృందావన కాలనీ’ రెండో భాగాన్ని అక్టోబర్‌ నుంచి ప్రారంభిస్తున్నాం’’ అని నిర్మాత  ఏయం రత్నం అన్నారు. రవికృష్ణ, సోనియా అగర్వాల్‌ జంటగా నటించిన చిత్రం ‘7/జీ బృందావన కాలనీ’. సెల్వరాఘవన్  దర్శకత్వంలో ఏయం రత్నం నిర్మించిన ఈ చిత్రం 2004లో విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమాను ఈ నెల 22న రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా రీ రిలీజ్‌ ట్రైలర్‌ లాంచ్‌ వేడుకలో రవికృష్ణ మాట్లాడుతూ– ‘‘ట్రైలర్‌ చూడగానే మళ్లీ రవి పాత్రలోకి వెళ్లిపోయాను. ఈ సినిమా రెండో భాగానికి ముందు మరోసారి ‘7/జీ బృందావన కాలనీ’ మ్యూజిక్‌ చూపించేలా ఈ చిత్రం రీ రిలీజ్‌ జరుగుతోంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో సోనియా అగర్వాల్, నటుడు సుమన్  శెట్టి మాట్లాడారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement