సంతోషమైనా, దుఃఖమైనా ఏదీ కలకాలం ఉండదు. పగలూరేయిలా ఒకదాని తర్వాత మరొకటి వస్తూ పోతూనే ఉంటాయి. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ జీవితంలోనూ ఇదే జరిగింది. స్టార్ అన్న బిరుదు సంపాదించడానికి ముందు ఆయన ఎంతగానో కష్టపడ్డాడు. ఒకానొక సమయంలో సంపాదించినదంతా పోగొట్టుకుని ఉట్టి చేతులతో నిలబడ్డాడు. కానీ గోడకు కొట్టిన బంతిలా మెరుపు వేగంతో మళ్లీ సంపాదించి నిలదొక్కుకున్నాడు. తాజాగా ఆనాటి గడ్డు పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు బిగ్‌బీ తనయుడు, నటుడు అభిషేక్ బచ్చన్.
సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రాలే
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'కెరీర్ తొలినాళ్లలో బాలీవుడ్‌లో చాలా కష్టపడ్డాను. నటుడిని అవ్వాలన్న కోరిక నాలో బలంగా ఉండేది. కానీ రెండేళ్లపాటు చాలామంది డైరెక్టర్లు నాతో సినిమా చేయడానికి వెనుకడుగు వేశారు. అదే సమయంలో నాన్న(అమితాబ్ బచ్చన్) ఓ బిజినెస్ ప్రారంభించి ఉన్నదంతా పోగొట్టుకోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. నేను, నా స్నేహితుడు కలిసి సొంతంగా కథ రాసుకోవాలనుకున్నాం.. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు.
దీన పరిస్థితి..
ఒకరోజు నాన్న.. ఫిలింఫేర్ అవార్డు కార్యక్రమానికి రమ్మన్నాడు. ఈవెంట్‌కు ఎలా రెడీ అయి వెళ్లాలని అందరూ కొన్ని నెలల ముందే ప్రిపేర్ అవుతుంటారు. పైగా 20 ఏళ్ల క్రితం ఎవరూ ఉచితంగా దుస్తులు ఇచ్చేవారు కాదు. కొనుక్కున్న వాటినే వేసుకుని వెళ్లాలి. సాయంత్రం షూటింగ్ లాంటివి పెట్టుకోకుండా ఇండస్ట్రీ అంతా సమయానికి అక్కడికి చేరుకుంటుంది. నేనేమో ఫంక్షన్‌కు ఏం వేసుకోవాలి? అని నాన్నను అడిగాను. ఇప్పుడిది మీకు విచిత్రంగా అనిపించవచ్చేమో కానీ ఆ సమయంలో మాత్రం పరిస్థితి అంత దారుణంగా ఉంది. నా దగ్గర సరైన బట్టలు లేవు.
కొనుక్కునే స్థోమత లేదు
ఆర్థిక కష్టాల వల్ల కొనుక్కునేంత స్థోమత కూడా లేకపోయింది. ఫార్మల్ డ్రెస్ లేదు, జీన్స్-టీషర్ట్ వేసుకుని వెళ్తే బాగోదు. మా సోదరి పెళ్లికి కొన్నేళ్ల క్రితం కొనుక్కున్న డ్రెస్ ఉంటే అదే వేసుకెళ్లాను' అని చెప్పుకొచ్చాడు అభిషేక్. కాగా ఈ ఫంక్షన్‌లో బార్డర్ సినిమాకుగానూ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్న జేపీ దత్తా.. అభిషేక్‌ను చూసి తనతో సినిమా తీయాలనుకున్నాడు. రిఫ్యూజీ మూవీతో అభిషేక్‌ను వెండితెరకు హీరోగా పరిచయం చేశాడు. స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌కు సైతం ఇదే తొలి సినిమా! అభిషేక్ చివరగా ఘూమర్ సినిమాలో కనిపించాడు.
చదవండి: కొత్త వ్యాపారం మొదలుపెట్టిన మనోజ్- మౌనిక.. దేశం నలుమూలలా తిరిగి..
Comments
Please login to add a commentAdd a comment