హీరో సిద్దార్థ్‌ మాజీ భార్య గురించి తెలుసా? | Actor Siddharth Second Marriage, Know Interesting Facts About His First Wife Meghna - Sakshi
Sakshi News home page

Siddharth Second Marriage: సిద్దార్థ్‌కు 21 ఏళ్ల క్రితమే పెళ్లి.. ఆ కారణం వల్లే విడాకులు?

Published Wed, Mar 27 2024 5:19 PM | Last Updated on Wed, Mar 27 2024 6:12 PM

Actor Siddharth Second Marriage, Know Interesting Facts About His First Wife Meghna - Sakshi

సిద్దార్థ్‌ తమిళ హీరో.. కానీ తెలుగులో కూడా ఎంతో క్రేజ్‌ తెచ్చుకున్నాడు. బాయ్స్‌ సినిమాతో వరుస అవకాశాలు అందుకున్నాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో తన నటనతో కట్టిపడేశాడు. బొమ్మరిల్లు మూవీతో స్టార్‌ హీరో అయిపోయాడు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఆట, ఓయ్‌, బావ, అనగనగా ఓ ధీరుడు.. ఇలా వరుస సినిమాలు చేసుకుంటూ పోయాడు. కానీ నెమ్మదిగా తన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద నెగెటివ్‌ టాక్‌ తెచ్చుకోవడంతో టాలీవుడ్‌కు దూరమయ్యాడు. ఆ మధ్య మహాసముద్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినా హిట్‌ కొట్టలేకపోయాడు.

గతంలో పెళ్లి
కొంతకాలంగా హీరోయిన్‌ అదితిరావు హైదరితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ వార్తల్లో నిలుస్తున్నాడు సిద్దార్థ్‌. మీడియా ముందు మాత్రం ఆమెతో కలిసి పోజివ్వడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. ఈరోజేమో సడన్‌గా అదితిని రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు.. అతడికి ఆల్‌రెడీ పెళ్లయిందా? అని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికీ టీనేజ్‌ కుర్రాడిలాగే కనిపిస్తాడు కాబట్టి ఇది రెండో పెళ్లంటే నమ్మలేకపోతున్నారు.

మూడేళ్లకే మనస్పర్థలు
సిద్దార్థ్‌ 2003లో తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఢిల్లీలో అతడి పక్కింట్లోనే ఉండేది. సిద్దార్థ్‌- మేఘన మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వీరికి ఓ బాబు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ మూడేళ్లకే వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఇద్దరూ విడివిడిగా జీవించడం మొదలుపెట్టారు. కలిసుండటం కష్టమని భావించి 2007లో విడాకులు తీసుకున్నారు. హీరోయిన్‌ సోహా అలీ ఖాన్‌తో ప్రేమ వ్యవహారం నడపడం వల్లే దంపతుల మధ్య గొడవలు తలెత్తాయని అప్పట్లో మీడియా కోడై కూసింది.

ఆమె వల్లే బ్రేకప్‌
వారు తరచూ కలుసుకుంటూ, సినిమాలకు వెళ్తూ కనిపించడంతో ఇది నిజమేనని పలువురు భావించారు. సదరు హీరోయిన్‌ మాత్రం తాము కేవలం స్నేహితులమేనని ఆ వార్తలను కొట్టిపారేసింది. ఇదిలా ఉంటే విడాకుల అనంతరం సిద్దార్థ్‌.. సోహాతో కలిసి ఒకే ఇంట్లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. కొంతకాలానికి వీరు కూడా విడిపోయారు. 

చదవండి: తెలుగు హీరోయిన్‌ను పెళ్లాడిన సిద్దార్థ్‌.. ఇద్దరికీ రెండోదే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement