
మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీరిద్దరూ కలిసి ఓ పెళ్లి వేడుకలో కలిసి కనిపించి కనువిందు చేశారు. మాజీ మంత్రి బుద్ధ ప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ మ్యారేజ్ రిసెప్షన్ హైదరాబాద్‌లో జరిగింది. అక్కడికి మెగాస్టార్, పవర్‌స్టార్ వచ్చారు. ఆ సమయంలో కలుసుకున్న ఈ మెగా బ్రదర్స్ నవ్వుతూ పలకరించుకున్నారు.
మెగా బ్రదర్స్ రాకతో ఆ ఫంక్షన్‌కి కొత్త కళ వచ్చింది. అనంతరం ఇద్దరూ కలిసి వధూవరులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. అయితే అంతకుముందు పవన్ కల్యాణ్, తన అన్నయ్య చేతిలో చేయి వేసి నవ్వుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అవి వైరల్‌గా మారాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే పవర్ స్టార్ ‘భీమ్లా నాయక్’, ‘హరిహర వీరమల్లు’ వంటి సినిమాలు చేస్తున్నారు. మరోవైపు మెగాస్టార్ సైతం ‘ఆచార్య’, ‘గాడ్‌ఫాదర్’ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. కాగా ఇటీవల చేతికి సర్జరీకి కావడంతో చిరు కొన్ని రోజులు షూటింగ్‌కి గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు.
చదవండి: సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు.. విజయమెవరిది?
#Pawankalyan #Chiranjeevi pic.twitter.com/BbNRLGbrwK
— Po\w/eR sTaR (@DhanarajPspk1) October 25, 2021