Actress Payal Ghosh shares unfinished suicide note goes viral - Sakshi
Sakshi News home page

Payal Ghosh: తారక్‌ గ్లోబల్‌ స్టార్‌ అవుతాడని ముందే ఊహించిన నటి.. సూసైడ్‌ నోట్‌ వైరల్‌

Mar 15 2023 11:25 AM | Updated on Mar 15 2023 11:53 AM

Actress Payal Ghosh Suicide Note Viral - Sakshi

నేను ఆత్మహత్య చేసుకుని మరణిస్తే అందుకు కారణం ఎవరంటే...

పదిహేడేళ్ల వయసులోనే సినిమాల్లో అడుగుపెట్టింది పాయల్‌ ఘోష్‌. 'షేర్ప్స్‌ పెరిల్‌'  అంగే ఇంగ్లీష్‌ చిత్రంలో నటించిన ఆమె మరుసటి ఏడాది చంద్రశేఖర్‌ యేలేటి డైరెక్ట్‌ చేసిన 'ప్రయాణం' మూవీలో కథానాయికగా మెరిసింది. ఆ తర్వాత 'ఊసరవెల్లి', 'మిస్టర్‌ రాస్కెల్‌' వంటి సినిమాలు చేసింది. 'పటేల్‌ కీ పంజాబీ షాదీ' సినిమాతో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది పాయల్‌. ఈమె జూనియర్‌ ఎన్టీఆర్‌కు అభిమాని. ఆయన గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా సహించేది కాదు.

ఈ క్రమంలో తారక్‌, రామ్‌చరణ్‌ నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటునాటు పాటకు ఆస్కార్‌ రావడంతో సంతోషం వ్యక్తం చేసింది నటి. 'జూనియర్‌ ఎన్టీఆర్‌ గ్లోబల్‌ స్టార్‌ అవుతారని 2020లోనే చెప్పాను. ఆస్కార్‌కు ముందే ఈ విషయాన్ని అంచనా వేశాను. నేనెప్పుడూ అబద్ధం చెప్పను' అని ట్వీట్‌ చేసింది. ఇది చూసిన తారక్‌ అభిమానులు.. అవును పాయల్‌.. నువ్వు చెప్పిందే నిజమైంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరో పక్క పాయల్‌ సూసైడ్‌ నోట్‌ పోస్ట్‌ చేసింది. 'ఒకవేళ నాకు గుండెపోటు వచ్చినా, ఆత్మహత్య చేసుకుని మరణించినా అందుకు కారణం ఎవరంటే....' అని సగం రాసి ఉన్న పేజీని పోస్ట్‌ చేసింది. ఇది చూసిన అభిమానులు నటి గురించి ఆందోళన చెందుతున్నారు. ఏం జరిగింది? బాగానే ఉన్నావా? దయచేసి ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకో, ఇలాంటి ఆలోచనలు దగ్గరికి కూడా రానివ్వద్దు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా పాయల్‌.. మీటూ ఉద్యమం సమయంలో నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement