Adipurush Movie Update: Anushka Sharma May Acts as Sita along with Prabhas | ఆదిపురుష్‌లో సీత‌గా అనుష్క శ‌ర్మ‌ - Sakshi
Sakshi News home page

ఆదిపురుష్‌: సీత‌గా అనుష్క శ‌ర్మ‌!

Published Fri, Sep 11 2020 4:45 PM | Last Updated on Fri, Sep 11 2020 7:26 PM

Adipurush: Anushka Sharma As Sita In Prabhas Movie - Sakshi

బాహుబ‌లి హీరో ప్ర‌భాస్ తాజాగా న‌టిస్తున్న త్రీడీ చిత్రం "ఆదిపురుష్"‌. ఈ సినిమాలో ప్ర‌భాస్‌ రాముడిగా క‌నిపించ‌నున్నారు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను రావ‌ణుడిగా ఎంపిక చేశారు. ఇంకా హ‌నుమంతుడు, సీత వంటి ఇత‌ర పాత్ర‌ల‌కు సంబంధించి న‌టీన‌టుల ఎంపిక జ‌రుగుతోంది. ఇదిలా వుంటే సీత పాత్ర గురించి మొద‌టి నుంచీ ఎన్నో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. సీతగా మ‌‌హాన‌టి కీర్తి సురేష్‌, కియారా అద్వాణీ పేర్లు వినిపించాయి. ఆ త‌ర్వాత నటి ఊర్వ‌శి రౌతేలా సీత‌గా క‌నిపించ‌నుంద‌ని ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. అయితే ఇది పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని, ఆదిపురుష్ సినిమా కోసం ఊర్వశిని సంప్ర‌దించ‌లేద‌ని చిత్ర‌యూనిట్ స్ప‌ష్టం చేసింది. (చ‌ద‌వండి: అటవీ భూమిని దత్తత తీసుకున్న ప్రభాస్‌ )

దీంతో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో మ‌రోసారి సీత జాడ కోసం వెతుకులాడుతున్నారు. ఈ క్ర‌మంలో మ‌రో ఇంట్రెస్టింగ్ వార్త అభిమానుల‌ను ఆశ్చ‌ర్య‌పరుస్తోంది. త్వ‌ర‌లో త‌ల్లి కాబోతున్న న‌టిని రంగంలోకి దించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ‌ను ప్ర‌భాస్‌తో జోడీ క‌ట్టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇద్ద‌రూ పొడుగ‌రులే కాబ‌ట్టి ఈడూజోడూ బాగుంటుంద‌ని ద‌ర్శ‌కుడు ఔం రౌత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. (త్వరలో ముగ్గురం కాబోతున్నాం)

పైగా క‌థ విన‌గానే అనుష్క చాలా థ్రిల్ ఫీలైందంటున్నారు. మ‌రి అనుష్కప్రెగ్నెంట్ క‌దా? షూటింగ్‌లో ఎలా పాల్గొంటుంది అంటారా? మ‌రేం లేదు. ఎలాగో అనుష్క జ‌న‌వ‌రిలో శిశువుకు జ‌న్మ‌నిస్తాన‌ని వెల్ల‌డించింది. చిత్ర‌యూనిట్ కూడా వ‌చ్చే ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభిస్తానంటోంది. దీంతో అనుష్క‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగా ఆమె అవ‌స‌రం లేని సీన్ల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. త‌ర్వాత‌ కొంత విరామం తీసుకుని అనుష్క‌పై షూట్ చేయ‌నున్నారు. (చ‌ద‌వండి: ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం: ఆదిపురుష్‌ టీం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement