
ఆకాశవాణి ప్రభు, ప్రమీలారాణి, ఈషాన్, తుల్యజ్యోతి, యువరాజ్, వినోద్, వీరేంద్రగిద్ద ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ధర్మః. విజయ్ కుమార్ యల్కోటి దర్శకత్వం వహించగా పి.యస్ ఆర్ ప్రొడక్షన్స్, యం.ఆర్.ఆర్ క్రియేషన్స్, వై.పి.బి.ఆర్ ఆర్ట్స్ పతాకంపై ప్రశాంత్‌కుమార్ పరిగెల, సతీష్‌కుమార్ చిప్పగిరి సంయుక్తంగా నిర్మించారు. రంగురాజేందర్, శ్రీధర్ సహ నిర్మాతలుగా, నవీన్ ప్రవీణ్, నరేందర్, అనంత్ రెడ్డి గంది లైన్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. 'తప్పు చేసిన వాడిని శిక్షించడమే "ధర్మః" చిత్ర కథాంశం. స్లం, రగ్డ్ & క్రైమ్ అండ్ మెసేజ్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. టైటిల్‌కు తగ్గట్టే ఈ సినిమా ఉంటుంది' అన్నారు. హీరో ఆకాశవాణి ప్రభు మాట్లాడుతూ.. ఈ చిత్రంలో సూరి అనే పాత్ర చేశాను. దర్శక, నిర్మాతలు మాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఙతలు' అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment