Ala Ninnu Cheri: Dinesh Tej Birthday Special Poster Released - Sakshi
Sakshi News home page

Ala Ninnu Cheri: యంగ్‌ హీరో బర్త్‌డే, స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌

May 26 2023 6:53 PM | Updated on May 26 2023 7:11 PM

Ala Ninnu Cheri: Dinesh Tej Birthday Special Poster Released - Sakshi

'అలా నిన్ను చేరి' అంటూ ఇది వరకు దినేష్ తేజ్ సినిమా అప్డేట్లను సోషల్ మీడియాలో వదలగా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేడు (మే 26) దినేష్ తేజ్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ రిలీజ్ చేశారు.

యంగ్‌ హీరోలు మంచి దూకుడు మీదున్నారు. కొత్త కొత్త కథలు ఎంచుకుంటూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే దినేష్ తేజ్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'అలా నిన్ను చేరి' అంటూ ఇది వరకు దినేష్ తేజ్ సినిమా అప్‌డేట్లను సోషల్ మీడియాలో వదలగా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేడు (మే 26) దినేష్ తేజ్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ రిలీజ్ చేశారు.

పోస్టర్‌ చూస్తుంటే ఇది మాస్ సాంగ్‌లో స్టిల్ అని తెలుస్తోంది. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో రాబోతున్న ‘అలా నిన్ను చేరి’  సినిమాతో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సినిమాలో దినేష్ తేజ్ సరసన హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను కొమ్మలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్నారు. 

సుభాష్‌ ఆనంద్ సంగీతం అందించగా.. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ అన్ని పాటలు రాయడం విశేషం. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ గ్లింప్స్, మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే రిలీజ్ డేట్‌ను మేకర్స్‌ ప్రకటించనున్నారు.

చదవండి: యాచకులకు వడ్డించిన బిచ్చగాడు హీరో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement