
Alec Baldwin 63 Years Expecting Seventh His Child With Wife Hilaria: హాలీవుడ్ నటుడు అలెక్ బాల్డ్విన్ మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఇప్పటికే ఆరుగురి సంతానం ఉన్న ఈ 63 ఏళ్ల యాక్టర్‌కు ఏడో సంతానం కలగనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అలెక్ భార్య, అమెరికన్ యోగా శిక్షకురాలు హిలేరియా బాల్డ‍్విన్ పంచుకున్నారు. 'గత కొన్నేళ్లుగా అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ అప్స్ అండ్ డౌన్స్ చవిచూశాం. ఇప్పుడు ఒక ఉత్తేజకరమైన, సంతోషకరమైన అప్‌ను చూడబోతున్నందుకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మా కుటుంబంలోకి మరో బాల్డ్‌వినిటో రానుంది. ఇప్పుడు మా కుటుంబం పూర్తయిందని నమ్ముతున్నాం. ఈ ఆశ్చర్యకరమైన వార్తతో మేము చాలా సంతోషంగా ఉన్నాం.' అంటూ ఆమె రాసుకొచ్చారు.
కాగా హిలేరియా 2019 ఏప్రిల్‌లో గర్భస్రావం కావడంతో బిడ్డకు జన్మనివ్వలేకపోయింది. 2021లో రస్ట్ మూవీ షూటింగ్‌లో అలెక్ ప్రాప్ గన్‌తో యాక్సిడెంటల్‌గా సినిమాటోగ్రాఫర్ హల్యానా హచిన్స్‌ను చంపడంతోపాటు డైరెక్టర్‌ను గాయపరిచాడు. దీంతో ఈ కటుంబం చిక్కుల్లో పడింది. అలాంటి అనిశ్చితి పరిస్థితుల మధ్య వారు సంతానాన్ని ఆశించలేకపోయారు. ఇప్పుడు 2022లో మళ్లీ ఒక బిడ్డకు తల్లిదండ్రలు కాబోతుండటంతో సంతోషంగా ఉంది అలెక్ ఫ్యామిలీ. అలాగే హిలేరియా తన పోస్ట్‌తో పాటు తాను, తన భర్త అలేక్ వారి ఆరుగురు పిల్లలతో ఆడుకుంటున్న వీడియో కూడా షేర్ చేశారు. వారికి కుమార్తెలు లూసియా విక్టోరియా 13 నెలలు, కార్మెన్ గాబ్రియేలా 8 ఏళ్లు, కుమారులు రాఫెల్ థామస్ 6, లియోనార్డో ఏంజెల్ చార్లెస్ 5, రోమియో అలెజాండ్రో డేవిడ్ 3, ఎడ్వర్డో పావో లుకాస్ 18 నెలలు ఉన్నారు. అంతేకాకుండా అలెక్‌కు 26 ఏళ్ల కూతురు ఐర్లాండ్ బాల్డ్వీన్ కూడా ఉంది. ఆమె అలెక్, తన మాజీ భార్య కిమ్ బాసింగర్‌ల కుమార్తె.
Comments
Please login to add a commentAdd a comment