
'పుష్ప' హీరో అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. స్వయంగా ఇంటికెళ్లి మరీ అదుపులోకి తీసుకున్నారు. అయితే బట్టలు మార్చుకునే టైమ్ ఇవ్వమని బన్నీ అడిగినప్పటికీ.. పోలీసులు ససేమీరా అన్నారు. దీంతో అలానే అల్లు అర్జున్.. పోలీస్ వ్యాన్ ఎక్కాడు. అయితే పోలీసులతో వెళ్లేముందు బన్నీ భార్య స్నేహారెడ్డి ఎమోషనల్ అయింది. కన్నీళ్లు పెట్టుకుంది.
(ఇదీ చదవండి: సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్)
అరెస్ట్ అనే విషయం తెలిసిన వెంటనే అల్లు అర్జున్ భార్య స్నేహా తట్టుకోలేకపోయింది. దీంతో బన్నీ ఆమెని సముదాయించాడు. 'స్నేహ భయపడకు.. నాకు ఏమీ కాదు' అని చెప్పాడు. తన భార్యకు ముద్దు ఇచ్చి అల్లు అర్జున్ పోలీసు వాహనం ఎక్కాడు. అదే టైంలో తండ్రి అల్లు అరవింద్ కూడా వ్యాన్ ఎక్కడంతో.. ఆయన్ని వద్దని చెప్పి బన్నీ ఒక్కడే పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: మీడియాపై దాడికి క్షమాపణ చెప్పిన మోహన్ బాబు)
Actor #AlluArjun arrested days after a woman was killed in a stampede at a 'Pushpa 2' screening in Hyderabad.
But what's his fault? Isn't crowd control the police's responsibility? pic.twitter.com/bZoPa0LIdh— Prayag (@theprayagtiwari) December 13, 2024
Comments
Please login to add a commentAdd a comment