Allu Arjun Attends Upasana Konidela Baby Shower Celebration, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Allu Arjun: ఉపాసన సీమంతానికి వచ్చిన అల్లు అర్జున్‌, రూమర్స్‌కు చెక్‌ పెట్టినట్లేనా?

Published Mon, Apr 24 2023 12:30 PM | Last Updated on Mon, Apr 24 2023 2:26 PM

Allu Arjun Attends Upasana Baby Shower - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ త్వరలో తండ్రిగా ప్రమోషన్‌ పొందనున్నాడు. జూలైలో డెలివరీ డేట్‌ ఉందని ఇదివరకే ఉపాసన వెల్లడించింది. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత తమ జీవితాల్లో అడుగుపెట్టబోతున్న చిన్నారి కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారీ దంపతులు. ఇప్పటికే ఈ సంతోషంతో గాల్లో తేలియాడుతున్న చెర్రీ భార్య ఉపాసనను విదేశాలకు తీసుకెళ్లి తనకోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నాడు. మూడు నెలల పాటు సినిమాలకు సైతం బ్రేక్‌ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు.

ఇదిలా ఉంటే ఇటీవల చరణ్‌-ఉపాసనల స్నేహితులు దుబాయ్‌లో బేబీ షవర్‌ పార్టీ ఏర్పాటు చేసి ఉపాసనను ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే! ఆ తర్వాత చిరంజీవి నివాసంలోనూ ఆమె సీమంతం వేడుక జరిగింది. తాజాగా మరోసారి ఉపాసన బేబీ షవర్‌ పార్టీ జరిగింది. ఈ వేడుకకు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హాజరయ్యాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. ఉపాసనతో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ.. చాలా సంతోషంగా ఉంది ప్రియమైన ఉప్సీ అని రాసుకొచ్చాడు.

మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య విభేదాలున్నాయన్న పుకార్లకు ఈ ఒక్క ఫోటోతో చెక్‌ పెట్టాడు బన్నీ. ఈ బేబీ షవర్‌ పార్టీకి బంధుమిత్రులతో పాటు టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా కూడా హాజరయ్యారు. ఇకపోతే అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు శంకర్‌ డైరెక్షన్‌లో రామ్‌ చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ సినిమా చేస్తున్నాడు.

చదవండి: ధర్మవరపు సుబ్రహ్మణ్యం చనిపోయినా ఇంటికి రాని బ్రహ్మానందం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement