Allu Arjuna Shocking Comments On Director Sukumar In Pushpa Movie Success Meet: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’ మాసీవ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. విడుదలైన మూడు రోజుల్లో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి ప్రపంచ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో పుష్ప టీం సక్సెస్ మీట్‌తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో బన్నీ మాట్లాడుతూ సుకుమార్ గురించిన ఆసక్తిక విషయం చెప్పాడు. సెట్‌లో సుకుమార్ ఎలా ఉంటాడు, ఆయన తీరుతో ఎలా ఇబ్బంది పడేవాడో వివరించాడు.
చదవండి: సుకుమార్‌పై నెటిజన్ల ఫైర్.. ఆ వెబ్ సిరీస్‌ను కాపీ కొట్టాడా?
ఈ క్రమంలో సుకుమార్‌ను మనసులో నిన్ను తగలేయా అని తిట్టుకునే వాడిని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు బన్నీ. ఈ మేరకు అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘సాధారణంగా ప్రపంచంలో ఏ డైరెక్టర్ అయినా షార్ట్ పూర్తవగానే యాక్టర్‌కు చెప్పే ఫస్ట్‌మాట టేక్ ఒకే సార్ అని. ఏ డైరెక్టర్(ఈవెన్ కొత్త డైరెక్టర్‌తో సహా) అయినా చెప్పే మాట ఇదే. ఎంత పెద్ద నటుడికి అయిన షాట్ అయిపోగానే బాగా వచ్చిందా? రాలేదా? అనే టెన్షన్ ఉంటుంది. కానీ సెట్‌లో సుకుమార్ షాట్ అవ్వగానే తల గొక్కుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. నేనేమో దూరం నుంచి చూస్తుంటాను. ఆయనేమో తల కిందకు దించుకుని ఆలోచిస్తూ కనిపిస్తాడు.
చదవండి: Pushpa Movie: అల్లు అర్జున్‌పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
అసలు నావైపే చూడరు. ఎదురుగా వెళ్లిన కూడా నా వంక చూడకుండా ఏదో ఆలోచిస్తున్నట్లు టెన్షన్ కనిపిస్తారు. ఎమైందీ షాట్ బాగా రాలేదా ఏంటని 2, 3 నిమిషాలే వేయిట్ చేస్తాను. ఎంతకి ఆయన చెప్పకపోవడంతో టెన్షన్ తట్టుకోలేక నేనే వెళ్లి ‘ఏ డార్లింగ్ షాట్ బాగా రాలేదా, మరోసారి చేద్దామా’ అని అడుగ్గానే. హే డార్లింగ్ టేక్ సూపర్ వచ్చింది అని పిడుగు పడ్డంత రియాక్షన్ ఇస్తాడంటూ బన్నీ సుకుమార్‌ని ఇమిటేట్ చేస్తూ చూపించాడు. ఇక సుకుమార్ టేక్ బాగా వచ్చిందని చెప్పగానే మనసులో ‘సుకుమార్ నిన్ను తగిలేయా..’ అని తిట్టుకునే వాడినని చెప్పుకొచ్చాడు.
Icon Star @alluarjun perfectly imitating @aryasukku 😃
— Mythri Movie Makers (@MythriOfficial) December 19, 2021
A special interview of Team #PushpaTheRise out very soon 💥💥#ThaggedheLe 🤙#PushpaBoxOfficeSensation@iamRashmika @ThisIsDSP @adityamusic @TSeries @PushpaMovie pic.twitter.com/DU9jDnQAEI
Comments
Please login to add a commentAdd a comment