
అల్లు అర్జున్.. ఈ పేరే ఒక బ్రాండ్. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన బన్నీ ఇటీవల పలు యాడ్స్‌లో కనిపిస్తున్నాడు. ఈ వాణిజ్య ప్రకటనల కోసం తన లుక్స్ కూడా మార్చుకుంటున్నాడు. సాధారణంగా ఈ పుష్పరాజ్ ఒక్కో యాడ్‌కు రూ.7.5 కోట్లు తీసుకుంటాడని సమాచారం. ఈ క్రమంలో తాజాగా ఓ కంపెనీ తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేయాలంటూ అల్లు అర్జున్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఏకంగా రూ.10 కోట్లు పారితోషికం ఇస్తామని ఆఫర్ చేశారట.
అయినప్పటికీ ఐకాన్ స్టార్ మాత్రం ఆ యాడ్ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడట. కారణం.. అది గుట్కా అండ్ లిక్కర్ కంపెనీ కావడమే! జనాలకు హాని చేసే అలవాట్లను ప్రోత్సహించే ఉద్దేశ్యం లేని హీరో ఆ భారీ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం బయటకు రాగా అతడి మంచి మనసుకు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులను బన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించడంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: బెడ్ షేర్ చేసుకోవాలనుందని అడిగిందంటే ఆమె ఆడదే కాదు: నటుడు
విజయ్ అన్న చీజ్ కావాలంట? అంటూ కామెంట్స్, ‘రౌడీ’ రియాక్షన్ చూశారా?
Comments
Please login to add a commentAdd a comment