Amazon Prime Huge Deal For Pushpa OTT Release Even After Theatrical Release: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లక్‌బస్టర్ హిట్ అందుకుంది. విడుదలై మూడు వారాలు దాటినా ఇప్పటికీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది పుష్ప. కరోనా వైరస్, ఒమిక్రాన్ కాలంలోనూ పుష్ప అన్ని భాషల్లో మంచి వసూళ్లు రాబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ. 300కోట్ల ట్రేడ్ మార్క్‌ను దాటేసి సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో ఈ పుష్పను సంక్రాంతి సందర్భంగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: ‘ఆచార్య’ మూవీ టీంకు షాక్, మెగాస్టార్ చిత్రంపై పోలీసులకు ఫిర్యాదు
రేపు(జనవరి 7) రాత్రి 8 గంటల నుంచి పుష్ప స్ట్రీమింగ్ కానుందని అమెజాన్ ప్రైం అధికారిక ప్రకటన ఇచ్చింది. దీంతో ఇప్పటికీ థియేటర్లో కలెక్షన్లు బాగానే రాబడుతున్న క్రమంలో ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయడం ఎందుకని, ఇది థియేటర్ వసూళ్లపై ప్రభావం పడుతుందని బన్నీ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మేకర్స్ అప్పుడే ఈ పాన్ ఇండియా చిత్రం ఓటీటీ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పుష్ప ఓటీటీ కోసం అమెజాన్ ప్రైం భారీ ఒప్పందానికి సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం థియేట్రికల్ రిలీజ్ అనంతరం కూడా కళ్లు చెదిరే ఫ్యాన్సీ రేటుకు అమెజాన్ ప్రైం పుష్ప ఓటీటీ డీల్ కుదుర్చుకుందని సినీ వర్గాల నుంచి సమాచారం.
చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన మీనా, ఆందోళనలో ఫ్యాన్స్
తమ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం అమెజాన్ ప్రైం ఈ మూవీ మేకర్స్‌కు రూ. 22 కోట్లు చెల్లిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పోస్ట్ రిలీజ్‌కు కూడా పుష్ప భారీ రేటుకు ఒప్పందం కుదరడంతో బన్నీ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఈ డీల్ కొంచం ఎక్కువ అనిపించిన ఇంత త్వరగా పుష్పను అమెజాన్ ప్రైం ఓటీటీలో విడుదల చేయడాన్ని చూస్తుంటే పుష్ప మూవీకి ఎంతటి క్రేజ్ ఉందో అర్థమవుతోంది. కాగా అన్ని భాషల్లో ఒకేసారి ఓటీటీలోకి వస్తున్న ‘పుష్ప’.. హిందీలో మాత్రం కాస్తా ఆలస్యంగా రానుందట. ఎందుకంటే బి-టౌన్ బక్సాఫీసు వద్ద ఈ మూవీ ఇప్పటికీ వసూళ్ల పరంగా దూసుకుపోతుండటంతో హందీ మేకర్స్ ఓటీటీలో విడుదల చేసేందుకు కాస్తా సమయం తీసుకుంటున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment