Pushpa Movie OTT Release Date: Pushpa Movie Streaming On OTT After 4 or 6 Weeks Of Theoretical Release - Sakshi
Sakshi News home page

Pushpa Movie OTT: బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఓటీటీలోకి పుష్ప మూవీ

Published Sat, Dec 18 2021 12:02 PM | Last Updated on Sat, Dec 18 2021 6:44 PM

Pushpa Movie Streaming On OTT After 4 or 6 Weeks Of Theoretical Release - Sakshi

Pushpa Movie Releasing On OTT Soon: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌-క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఎర్ర చందనం స్మింగ్లింగ్‌ నేపథ్యంలో పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కిన పార్ట్‌ 1 పుష్ప: ది రైజ్‌ పేరుతో శుక్రవారం(డిసెంబర్‌ 17) విడుదలైంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల మధ్యకు వచ్చినీ మూవీ పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏడు భాషల్లో పుష్ప రిలీజ్‌ అయ్యింది. ఇండియాలోనే కాదు అమెరికన్‌ బాక్సాఫీసు వద్ద కూడా పుష్ప కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పాన్‌ ఇండియా మూవీ అయిన పుష్ప ప్రపంచ బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్‌ రాబడుతూ దూసుకుపోతోంది.

చదవండి: పుష్ప మూవీకి భారీ షాక్‌, ఆందోళనలో దర్శక-నిర్మాతలు

ఈ క్రమంలో ఈ మూవీ నుంచి ఆసక్తికర అప్‌డేట్‌ బయటకు వచ్చింది. పుష్ప త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. 2022 కొత్త సంవత్సరం కానుగా డిజిటల్‌ ప్రేక్షకులను అలరించేందుకు పుష్ప అమెజాన్‌ ప్రైంలోకి రానుందట. థియేటర్లో విడుదలైన నాలుగు లేదా ఆరు వారాల తర్వాత పుష్ప ఓటీటీకి రానుంది. 4 వారాలకు అయితే జనవరి 14న, 6 వారాలకు అయితే జనవరి 28న ఓటీటీలో ప్రసారం కానుందని వినికిడి. ఇప్పటికే దీనిని అమెజాన్‌ ప్రైం ఫ్యాన్సీ రేటుకు ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తోంది.  దీనిపై త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

చదవండి: వివాదంలో పుష్ప స్పెషల్‌ సాంగ్‌, స్పందించిన దేవిశ్రీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement