Is Amitabh Bachchan Plays Mahesh Babu Father In Rajamouli Movie - Sakshi
Sakshi News home page

Mahesh Babu-Rajamouli Movie: మహేశ్‌-రాజమౌళి సినిమాలో ఆ స్టార్‌ హీరో? సూపర్‌ స్టార్‌కు తండ్రిగా కీ రోల్‌!

Dec 14 2022 11:15 AM | Updated on Dec 14 2022 12:48 PM

Is Amitabh Bachchan Plays Mahesh Babu Father in Rajamouli Movie - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ ఫస్ట్‌ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది. మహేశ్‌ బాబు తల్లి ఇందిర దేవి, తండ్రి సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతితో ఇక షెడ్యూల్‌ వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో త్వరలోనే సెకండ్‌ షెడ్యూల్‌ను ప్రారంభించబోతున్నట్లు చిత్ర బృందం రీసెంట్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్‌ రెండో షెడ్యూల్‌ ప్రారంభించనున్నట్లు మేకర్స్‌ తెలిపారు.

చదవండి: మాజీ కపుల్స్‌ ఐశ్వర్య-ధనుష్‌ తనయులతో సరదాగా రజనీ, ఫొటో వైరల్‌

ఇదిలా ఉంటే వచ్చే ఏడాదిలోనే మహేశ్‌ బాబు-రాజమౌళి సినిమా కూడా ప్రారంభం కానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ సినిమా 2023 మార్చిలో ప్రారంభం కానున్నట్లు గతంలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ ఓ ఇంటర్య్వూలో చెప్పారు. ఈ నేపథ్యంలో జక్కన-మహేశ్‌కు సంబంధించిన ప్రాజెక్ట్‌ సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మహేశ్‌ తండ్రి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం జక్కన్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను పరిశీలిస్తున్నారట. ఈ పాత్రకు ఆయన అయితనే కరెక్ట్‌ సెట్‌ అవుతారని ఆయన అభిప్రాయపడుతున్నారట.

దీంతో త్వరలోనే బిగ్‌బిని కలిసి కథ వివరించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం తెలిసి ఫ్యాన్స్‌ అంతా పాన్‌ వరల్డ్‌ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో దాదాపు అంత స్టార్‌ నటీనటులనే పరిశీలిస్తున్నారని, ఈ క్రమంలో అమితాబ్‌ బచ్చన్‌ని ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేస్తున్నారని చర్చించుకుంటున్నారు. అలాగే అలాగే హీరోయిన్‌గా బాలీవుడ్‌ భామనే అనుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాల్సి ఉంది. కాగా యాక్షన్‌ అడ్వెంచర్‌ తరహాలో రూపొందే ఈ చిత్రంలో మహేశ్‌ బాబు జెమ్స్‌బాండ్‌ తరహా కనిపిస్తారని ఓ ఇంటర్‌నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో జక్కన క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

చదవండి: 
తల్లయిన తర్వాత తొలిసారి బయటకు వచ్చిన నయన్‌, ఫొటోలు వైరల్‌
పెళ్లయిన డైరెక్టర్‌ను ధన్య బాలకృష్ణ సీక్రెట్‌ పెళ్లి చేసుకుందా? నటి సంచలన వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement