
బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే తన కజిన్ అలన్నా పాండే పెళ్లి వేడుకల్లో బిజీగా ఉంది. మంగళవారం ముంబైలో జరిగిన మెహందీ వేడుకలకు అనన్య హాజరైంది. ఈ ఫంక్షన్‌లో పింక్ లెహంగా మెరిసిపోయిందీ బ్యూటీ. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా ఫంక్షన్‌లో ఎంజాయ్ చేస్తుంటే అనన్య మాత్రం ఎంచక్కా సిగరెట్ తాగింది. పబ్లిక్‌లోనే దర్జాగా దమ్ము కొడుతున్న అనన్య ఫోటోను అలన్నా పెళ్లాడబోతున్న ఇవోర్ మెకరీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. కొద్ది సేపటికే సదరు ఫోటోను డిలీట్ చేశాడు.
కానీ అంతలోనే ఆ ఫోటోను స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకున్న ఓ వ్యక్తి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరలవుతోంది. 'అనన్య దమ్ము కొడుతుందా? ఇది అస్సలు ఊహించలేదు', 'అనన్య.. ఏంటి, ఇలా షాకిచ్చావు? నేనిది నమ్మలేకపోతున్నా..', 'పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం, దయచేసి ఆ అలవాటు మానేయ్', 'కంటికి కనిపించేదంతా నిజం కాదని మరోసారి నిరూపించావు' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా అనన్య పాండే.. విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమాతో తెలుగుతెరకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే!
Comments
Please login to add a commentAdd a comment